- సోనం వాంగ్ చుక్ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్: తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, “సంసద్ చలో” యాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సోనం వాంగ్ చుక్ డిమాండ్ చేశారు. ఈ మేరక సోమవారం సప్ధర్ జంగ్ ఆసుపత్రి వర్గాలకు లేఖ రాశారు. తన అధికారిక ‘ఎక్స్’ వేదికగా రాసిన నోట్‌లో….తాను బాగానే ఉన్నానని, యాత్రలో చేరేందుకు తాత్కాలికంగానైనా తనను వెళ్లనివ్వాలని ఆసుపత్రి అధికారులను వాంగ్‌చుక్ అభ్యర్థించారు. “ఈ రోజు నేను చాలా బాగున్నాను, నా ఆరోగ్య సూచికలు కూడా చాలా సాధారణంగా ఉన్నాయి. అందువల్ల, ఈ ఉదయం పార్లమెంటుకు జరిగే ‘సంసద్ చలో’ యాత్రలో నేను పాల్గొనేందుకు వీలుగా, తాత్కాలికంగానైనా నన్ను ఆసుపత్రి నుండి వెళ్లనివ్వాలని దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నేను మీకు ఎంతో కృతజ్ఞుడనై ఉంటాను,” అని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.
కాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూజనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్‌కు విద్యార్థులు, యువత భారీగా తరిలివచ్చారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం చేపట్టిన ‘చలో సంసద్’జయప్రదం చేయాలని జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. అనంతరం వారంతా ర్యాలీగా పార్లమెంట్ భవన్ వైపు దారితీశారు. మార్చ్ అడ్డుకోవడం కోసం పోలీసులు ‘చలో సంసద్’ మార్చ్‌పై విరుచుకుపడ్డారు.ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు లాఠీలతో ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



