నవతెలంగాణ – ముంబై : ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, జూన్ 2026తో ముగిసిన మొదటి త్రైమాసికానికి, నికర లాభం గతేడాదితో పోలిస్తే 27.8% వృద్ధితో రూ. 386 కోట్లకు చేరినట్లు నివేదించింది. ముఖ్యంగా, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యు 1 -ఎఫ్ వై 2027) కంపెనీ యొక్క టర్మ్ ప్లాన్ (రిటైల్ ప్రొటెక్షన్) వ్యాపారం గతేడాదితో పోలిస్తే 60.4% వృద్ధి చెందింది. కంపెనీ పేరును ‘ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్’గా మార్చే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
కంపెనీ ఎండీ & సీఈఓ శ్రీ అనూప్ బాగ్చి మాట్లాడుతూ, “ మా వ్యూహానికి అత్యంత కీలకమైన అంశం, వినియోగదారులకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం. క్యు 1 -ఎఫ్ వై 2027లో పరిశ్రమలోనే అత్యుత్తమంగా మా 99.3% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి, దర్యాప్తు అవసరం లేని క్లెయిమ్‌లను కేవలం 1 రోజులోనే పరిష్కరించడం, వినియోగదారులకు మరియు వారి కుటుంబాలకు అత్యంత అవసరమైన సమయంలో అండగా నిలవాలనే మా నిబద్ధతను స్పష్టం చేస్తుంది. ఈ త్రైమాసికంలో, మేము రూ. 1,306 కోట్ల డెత్ క్లెయిమ్‌లను సెటిల్ చేశాము, రూ. 3,360 కోట్లను మెచ్యూరిటీ & సర్వైవల్ బెనిఫిట్స్‌గా చెల్లించాము. ఇది మా పాలసీదారులకు సకాలంలో ఆర్థిక రక్షణ , మనశ్శాంతిని అందించడంపై మా నిరంతర దృష్టిని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా, ఆర్థిక సంవత్సరం 2026లో, మేము రూ. 5,149 కోట్ల డెత్ క్లెయిమ్‌లను చెల్లించటంతో పాటుగా రూ. 15,363 కోట్లను మెచ్యూరిటీ మరియు సర్వైవల్ బెనిఫిట్స్‌గా చెల్లించాము.
క్యు 1 -ఎఫ్ వై 2027 లో మా కంపెనీ యొక్క పన్ను అనంతర లాభం గత ఏడాదితో పోలిస్తే 27.8% పెరిగి రూ. 386 కోట్లకు చేరింది. ముఖ్యంగా, మేము బలమైన వృద్ధిని నమోదు చేశాము. క్యు 1 -ఎఫ్ వై 2027లో మా రిటైల్ ప్రొటెక్షన్ వ్యాపారంలో గత ఏడాది తో పోలిస్తే 60.4% వృద్ధిని సాధించడం, భారతదేశ రక్షణ అవసరాలను తీర్చడంలో మా నిరంతర నిబద్ధతను ప్రదర్శిస్తోంది.
సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మేము ఎకానమీస్ ఆఫ్ స్కేల్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ ) మరియు డిజిటల్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం కొనసాగిస్తాము. ముఖ్యంగా, క్యు 1 -ఎఫ్ వై 2027 లో మా సేవింగ్స్ కాస్ట్-టు-ప్రీమియం నిష్పత్తి 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గి 13.6%కి చేరింది. ఇది ఆవిష్కరణలలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి, డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి , భవిష్యత్ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి మాకు వీలు కల్పించింది.
సంబంధిత ఆమోదాలకు లోబడి, కంపెనీ పేరును ‘ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్’గా మార్చే ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డు ఇటీవల ఆమోదించింది. ప్రతిపాదిత పేరు ఐసిఐసిఐ ఫ్రాంచైజీతో ముడిపడి ఉన్న బలం, విశ్వాసం మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మా వ్యాపారం యథావిధిగా వృద్ధి పథంలో కొనసాగుతోంది. మా పరిధిని విస్తరించడం, కస్టమర్ విలువను పెంచడం , భారతదేశంలో పెరుగుతున్న జీవిత బీమా మార్కెట్ అందించే గణనీయమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై మేము దృష్టి సారించాము..” అని అన్నారు.



