Wednesday, April 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్‌ ఫొటో

అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్‌ ఫొటో

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ చిత్రంతో ప్రత్యేక యూఎస్‌ పాస్‌పోర్టులను విడుదల చేయనున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా పరిమిత సంఖ్యలో ఇవి విడుదల చేయనున్నారు. ఈ పాస్‌పోర్టులపై స్వాతంత్ర్య ప్రకటన పత్రం నేపథ్యంతో ట్రంప్‌ ఫోటో, ఆయన సంతకం ఉండనుంది. అయితే అదనపు రుసుము లేకుండా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -