Wednesday, April 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రహదారిపై ఉన్న దాబాల మురికినీళ్లు రోడ్ల పైకి..పట్టించుకొని అధికారులు  

రహదారిపై ఉన్న దాబాల మురికినీళ్లు రోడ్ల పైకి..పట్టించుకొని అధికారులు  

- Advertisement -

– న్యూ పరివార్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

నవతెలంగాణ – కంది 
మండలంలోని కావాలంపేట గ్రామ శివారులో ఉన్న గణేష్ గడ్డ వద్ద నేషనల్ హైవే పైకీ వస్తున్నా మురికినీళ్లు అరికట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను కోరారు. మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురికినీళ్లు వదులుతున్న ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న రుద్రారం న్యూ పరివార్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంది, రుద్రారం గ్రామాలలో నేషనల్ హైవే రోడ్ ఉన్న డాబాలు హోటల్ ఇష్టానుసారంగా రోడ్ల పై డ్రైనేజి వాటర్ వదులుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యను పరిష్కారం చేయకపొతే ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యన్ శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -