- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ-హెచ్ ప్రాంగణంలో ఈ ఫలితాలను విడుదల చేసే కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, జేఎన్‌టీయూ-హెచ్ వీసీ టి.కిషన్‌కుమార్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఎప్‌సెట్ కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -



