Friday, June 19, 2026
E-PAPER
Homeజిల్లాలుమహాసభలకు అధిక సంఖ్యలో తరలిరండి:CPI(M) పిలుపు

మహాసభలకు అధిక సంఖ్యలో తరలిరండి:CPI(M) పిలుపు

- Advertisement -



నవతెలంగాణ-హైదరాబాద్: మహాబూబ్ నగర్ లో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాల్గో మహాసభలకు ధరూరు మండల కేంద్రం నుండి వ్యవసాయ కార్మికులు,ఉపాధి కూలీలు,కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం ధరూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం ముందు మహాసభల పోస్టర్ లు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …దేశంలోని వ్యవసాయ కార్మికుల ఉపాధి,కూలీల హక్కుల కోసం కొట్లాడుతూ నిరంతరం వారిని చైతన్యం చేస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు 20, 21 22 తేదీలలో మహబూబ్ నగర్ లో జరుగుతున్నాయని తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నుండి ర్యాలీ ప్రారంభమై,ఎంబీసీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎంపీ సదాశివం సహా అగ్ర నేతలు హాజరు కానున్నారని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దానిని ఒక పథకంగా మార్చి, పేదలకు కూలి డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా చేస్తూ పేదల కొనుగోలు శక్తిని నిర్వీర్యం చేస్తున్న విధానాలను సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు.

దేశంలో వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలకు ఉపాధిని దూరం చేస్తూ యూనియన్ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలు, పేదల కోసం రానున్న 3 సంవత్సరాల కాలంలో చేయనున్న పోరాటాల గురించి మహాసభలలో చర్చించనున్నట్లు తెలిపారు. మహాసభలకు ధరూర్ మండల కూలీలు, కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధరూర్ మండల సీపీఎం నాయకులు హమాలీ నరసింహూలు, మోష ఆంజనేయులు, తిమ్మప్ప, గోవిందు రిక్షా దేవన్న మన్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -