పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

నవతెలంగాణ నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పదర మండలం కూడన్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పొలం పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Spread the love