Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్ 

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్ 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోందనే సమాచారం మేరకు కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం నాగులమ్మ క్రాస్ వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తాడిచర్ల గ్రామానికి చెందిన బుర్ర శివ సాయి కుమార్, మంథని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దామ ప్రశాంత్ అనే ఇద్దరు యువకులు పల్సర్ బైక్ పై తాడిచెర్ల నుంచి కొయ్యుర్ వైపు 1కిలో 160 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, బైజ్ తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని సీజ్ చేసి ఎన్డిపిఎస్ పిడీ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లుగా ఎస్ఐ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. గత కొంతకాలంగా పక్క రాష్ట్రాల మారుమూల గ్రామాల నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తు జల్సాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. మండలంలో గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న, అలవాటు ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు తమ వద్ద ఉన్నాయని వారిపైన ప్రతిక్షణం నిఘా ఉంచబడుతుందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి గంజాయి విషయంలో రవాణా చేసిన తీసుకుని వచ్చిన అమ్మిన తాగిన వారిపైన కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకొనడమే కాకుండా వారిపై ఎన్.డి.పి.ఎస్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -