హైదరాబాద్ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో యూకో బ్యాంక్ నికర లాభాలు 22.8 శాతం పెరిగి రూ.801 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.652 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.6,744.59 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ4లో 1.31 శాతం తగ్గి రూ.6,656 కోట్లుగా నమోదయ్యింది. మొండి బకాయిలు (ఎన్‌పీఏ) భారీగా తగ్గడంతో పాటు ఆస్తుల నాణ్యత మెరుగుపడటంతో ప్రతి ఈక్విటీ షేరుకు రూ.0.44 డివిడెండ్‌ను ప్రకటించింది. ‘మెరుగైన రుణ నిర్వహణ, కేటాయింపుల తగ్గింపు వల్ల లాభదాయకత పెరిగిందని భవిష్యత్తులోనూ వినియోగదారులకు మరింత విలువను అందిస్తామని యూకో బ్యాంక్ ఎండీ, సీఈఓ అశ్విని కుమార్ పేర్కొన్నారు.



