Thursday, August 13, 2026
E-PAPER
Homeబీజినెస్10 శాతం ఉద్యోగులకు ఒరాకిల్ షాక్..!

10 శాతం ఉద్యోగులకు ఒరాకిల్ షాక్..!

- Advertisement -

త్వరలో మరో విడత ఉద్వాసనలు
శాన్‌‌ఫ్రాన్సిస్కో :
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ మరోమారు తమ ఉద్యోగులపై వేటు వేయనుందని తెలుస్తోంది. ఎఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై దృష్టి సారిస్తున్న వేళ వ్యయ నియంత్రణే లక్ష్యంగా కంపెనీ మరో విడత తొలగింపులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాది మే31 నాటికి తన మొత్తం సిబ్బందిలో దాదాపు 13 శాతం మందిని అంటే సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఒరాకిల్ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల సంఖ్య 1,62,000 నుంచి 1,41,000కు పడిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబరు 1 నాటికల్లా కొన్ని కీలక విభాగాల్లో రెండంకెలు (10 శాతానికి పైగా) స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం కసరత్తు పూర్తి చేసిందని రిపోర్టు చేసింది. ఇందులో భాగంగా తొలగింపు జాబితాలను సిద్ధం చేయాలంటూ సంబంధిత విభాగాల మేనేజర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -