Tuesday, September 22, 2026
E-PAPER
Homeబీజినెస్మళ్లీ ఆపిల్‌ ఉద్వాసనలు

మళ్లీ ఆపిల్‌ ఉద్వాసనలు

- Advertisement -

రెండు నెలల్లోనే రెండోసారి
శాన్‌‌ఫ్రాన్సిస్కో :
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ గత రెండు నెలల వ్యవధిలో రెండోసారి ఉద్యోగాల కోతకు తెరలేపింది. తాజా సమాచారం ప్రకారం.. ఆపిల్ తన ఫిట్‌నెస్ ప్లస్‌ విభాగానికి చెందిన కొద్ది మంది సిబ్బందిని తొలగించినట్లు బ్లూమ్‌ బెర్గ్ నివేదించింది. ఆపిల్ వాచ్ వినియోగదారుల కోసం అందించే టైమ్ టు వాక్, టైమ్ టు రన్ వంటి ఆడియో ఫీచర్లపై పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. అయితే ఈ సేవలను పూర్తిగా నిలిపివేయడం లేదని, సిబ్బంది తగ్గింపు కారణంగా భవిష్యత్తులో కొత్త ఆడియో కంటెంట్ విడుదల వేగం మాత్రం మందగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. టెక్ రంగంలో కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి నడుమ ఆపిల్ వ్యూహాలను మార్చుకుంటూ పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందిపై వేటు వేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -