Tuesday, September 22, 2026
E-PAPER
Homeజాతీయంధన ప్రభావంతోనే డీయూలో ఏబీవీపీ గెలుపు

ధన ప్రభావంతోనే డీయూలో ఏబీవీపీ గెలుపు

- Advertisement -

అభిజీత్‌ దీప్కే
న్యూఢిల్లీ :
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ధన ప్రభావంతోనే ఏబీవీపీ విజయం సాధించిందని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే విమర్శించారు. ఏబీవీపీ తరుపున ప్రచారం చేసినవారు విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారని తెలిపారు. ఎన్నికల గురించి విలేకరుల ప్రశ్నలకు అభీజీత్‌ ‌దీప్కే సమాధానం ఇస్తూ ‘‘ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపింది, వేరే ఏమీ కాదు. ఎన్నికల్లో ప్రచారం చేసిన వారు కోట్ల రూపాయల విలువైన కార్లలో వచ్చారు’’ అని గుర్తు చేశారు. అలాగే, ‘మహాత్మా గాంధీ అంతర్జాతీయ హిందీ విశ్వవిద్యాలయం’ వైస్ ఛాన్సలర్ కుముద్ శర్మ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల వ్యక్తి అని తెలిపారు. కుముద్‌ ‌వీసీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 50 మందికి పైగా విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదు చేశారని తెలిపారు. ‘కానీ ఒక్క ఏబీవీపీ కార్యకర్తపైనా కేసు నమోదు చేయలేదని, కానీ ఏబీవీపీని వ్యతిరేకించే దళిత, ఆదివాసీ విద్యార్థులపై మాత్రమే కేసులు నమోదు చేస్తారు. విద్యాసంస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ‌లుగా మార్చడానికి ఇది ఒక ప్రణాళిక’ అని దీప్కే విమర్శించారు. ఇలాంటి పరిస్థితులతో విద్యా వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీఎస్‌‌సీ) చైర్మెన్ వివేక్ భిమాన్వార్ రాజీనామా చేయాలని డిమాండ్‌‌తో సీజేపీ ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్న తెలిపారు. ఐఐటీ ముంబయిలో విద్యార్థి ఆత్యహత్య ఘటన బాధాకరమని తెలిపారు. ‘విద్యా వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం పోవడమే దీనికి కారణం. తమకు అండగా ఎవరూ లేరని భావించడం వల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని దిప్కే పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -