Tuesday, September 22, 2026
E-PAPER
Homeజాతీయంబ్యాంకుల్లో మరోసారి సమ్మె సైరన్‌

బ్యాంకుల్లో మరోసారి సమ్మె సైరన్‌

- Advertisement -

డిమాండ్ల సాధన కోసం 28 నుంచి 30 వరకు : యూఎఫ్‌బీయూ
న్యూఢిల్లీ :
బ్యాంకుల్లో మరోసారి సమ్మె సైరన్‌ మోగనుంది. తమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడురోజుల పాటు సమ్మె చేపట్టనున్నట్లు యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) సోమవారం స్ఫష్టం చేసింది. సెప్టెంబర్ 26, 27 తేదీలు వరుసగా నాలుగవ శనివారం, ఆదివారం కావడంతో, వరుసగా ఐదురోజుల పాటు బ్యాంక్‌ సేవలు నిలిచిపోనున్నాయి. 2024లో హామీ ఇచ్చిన వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమలు సహా నాలుగు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల11న యుఎఫ్‌బియు ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.
ఎస్బీఐ తమ వినియోగదారులకు ఒక సూచనను జారీ చేసింది. సమ్మె సమయంలోనూ అత్యవసర బ్యాంకింగ్ సేవలను అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తామని తన ఎస్బీఐ తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. అత్యవసరంగా నగదు లావాదేవీల కోసం ఏటీఎంలు, ఎడిడబ్ల్యుఎంలను వినియోగించాలని సూచించింది. అలాగే, కస్టమర్ సర్వీస్ పాయింట్లు (సిఎస్‌పిఎస్‌)లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది.
వారానికి ఐదు రోజుల పని విధానం, పెన్షన్ల సవరణ, పెన్షనర్లందరికీ ఒకే విధమైన కరువు భత్యం (డీఏ) విధానాన్ని అమలు చేయాలని యూఎఫ్‌బీయూ డిమాండ్‌ చేస్తోంది. ఈ డిమాండ్లను గతంలో కూడా పలుమార్లు లేవనెత్తారు. ప్రభుత్వం, బ్యాంక్ యాజమాన్యాలు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరకపోవడం వల్లే ఉద్యోగులు సమ్మె మార్గాన్ని ఎంచుకున్నారని యూఎఫ్‌బీయూ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -