ఈ నగరం పునాది
ఎన్ని పచ్చని చెట్లను పెకిలించిందో కదా
నా తల గడ కింద
వన్నెల నెమళ్లు నాట్యం ఆడేవి కావచ్చు
కిర్రు మంటున్న ఆరాం కుర్చీ కింద
ఆకులు స రాగాలు కురిపించేవి
అందమ్కెన దశ్యాలన్నింటినీ ఆర్ సి సి
అస్తమయం చేసి అభివద్ది నంగనాచి మాటలు
సెలయేరు సవ్వడి చేసే చోట
మెషిన్ లు మోతాదు మించిన మోతలు
అందమ్కెన ఆకతుల రాళ్లను
క్రష్ ర్లు కంకర రాళ్లను చేశాయి
గుట్టలు గల్లంతు అయి పోయాయి
పశు పక్షాదులకు పరమాత్ముని వరంగా
దాహం తీర్చిన తాడి చెట్టు లోతు చెరువులు
లే అవుట్ కుట్ర లకు తాంబూలాలు గా
నీడను ఫలాల ను
ప్రసాదించిన వక్ష రాజులు గతించి
పక్షి కూడా వాలని మొక్కలు
పలు వరుసలుగా వెక్కిరిస్తున్నాయి
హౌర్డింగ్ బోర్డులు గాలిని బంధించాయి
చౌరస్తా దిక్కు తోచని కూడలి
రోడ్డు మీద నీడ కరువు అయి
ఎలెక్ట్రికల్ పోల్ కింద ఎతకాలిసిన రోజులు
పొలాల్లో రియల్ ఎస్టేట్ జెండాలు వెలిసి
కాసులు కూడ బెట్టు కోవడం కొత్త విద్య
NALA చట్టం నల్ల రేగడి నేలలను సైతం
నాగల్ల కు దూరం చేసి ఎండ పెట్టారు
తొవ్వ కు తోరణములు గా ద్రాక్ష తోటలు
పాత జ్ఞాపకాలు గా మిగిలి పాయె
పాడి పంటలు వదులుకుని రైతులు
ATM ముందు సెక్యూరిటీ గార్డులుగా నాగరికత అంతా ఇప్పుడు
అనుమతి లేని దిగుమతి సరుకు
మనిషి కోరికలను సమూలంగా కూల్చితేనె
చెట్టు చేమ కు తిరిగి న్యాయం చేకూర్చు
చల్లని గాలి కోసం తనువు తపస్సు
ఎయిర్ కండీషన్స్ ఎక్కువయి ఓజోన్ తుస్సు
నగరం పునాది కింద
లిఖించలేని విచ్చిత్తి పూడ్చ లేనంతగా ….
– దాసరి మోహన్, 9985309080