విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేత..

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అందజేశారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా వచ్చిన పాఠ్యపుస్తకాలను, ఏకరూప దుస్తులను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

Spread the love