Wednesday, April 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా లేబర్‌ సెక్రెటరీ రాజీనామా

అమెరికా లేబర్‌ సెక్రెటరీ రాజీనామా

- Advertisement -

– ‘ఆఫీస్‌ స్కాండల్‌’ ఆరోపణల నడుమ తప్పుకున్న లోరీ చావెజ్‌-డీరీమర్‌
– ట్రంప్‌ ప్రభుత్వానికి మరో దెబ్బ
వాషింగ్టన్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో లేబర్‌ సెక్రెటరీ లోరీ చావెజ్‌-డీరీమర్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత, వృత్తి సంబంధిత వివాదాల నేపథ్యంలో ఆమె తప్పుకున్నారు. ప్రయివేటు రంగంలో చేరుతున్నట్టు ఆమె అధికారి కంగా ప్రకటించినప్పటికీ.. ఆమెపై కొనసాగుతున్న విచారణ ఈ నిర్ణయానికి కారణ మని తెలుస్తోంది. ఈమె రాజీనామా ట్రంప్‌ పాలనకు మరో దెబ్బగా పరిశీలకులు చెప్తున్నారు. ఆమె రాజీనామా తర్వాత కీత్‌ సాండర్‌లింగ్‌ తాత్కాలిక లేబర్‌ సెక్రెటరీగా నియమితులయ్యారు. కాగా వైట్‌హౌస్‌ ఆమె రాజీనామాను ధృవీకరించింది. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతినిధి స్టీవెన్‌ చెయుంగ్‌ మాట్లాడుతూ.. ఆమె ప్రయివేటు రంగంలోకి వెళ్తున్నారని తెలిపారు. ఆమె పదవీ కాలాన్ని ప్రశంసిస్తూ.. ఇది సాధారణ మార్పు అని వివరించారు. అయితే, ఈ రాజీనామా వెనుక కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ నిర్వహిస్తున్న విచారణ కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె సన్నిహిత సహచరుల పైనా పలు అభియోగాలు నమోదయ్యాయి.
అసోసియేటెడ్‌ ప్రెస్‌ నివేదికల ప్రకారం.. ఆమెకు ఒక సెక్యూరిటీ సిబ్బందితో అనుచిత సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే కార్యాలయంలో మద్యం నిల్వ చేయడం, వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొందరు వ్యక్తులకు రాజకీ యంగా ఫెడరల్‌ గ్రాంట్లు మళ్లించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు ఆరోపణలూ ఉన్నా యి. కాగా ఈ విచారణ ఇప్పటికే సంబంధిత శాఖలోని పలువురు అధికారుల తొలగిం పునకు దారితీసింది. డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్‌ నుంచి పదవి విడిచిన మూడో వ్యక్తి లోరీ చావెజ్‌ కావడం గమనార్హం. ఆమెకు ముందు క్రిస్తీ నోయెమ్‌, పామ్‌ బోండీలు తమ పదవుల నుంచి వైదొలిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -