సరస్వతమ్మ భౌతికకాయానికి పలువురి నివాళి
నేడు ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీకి పార్థివదేహం అప్పగింత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి మాతృమూర్తి చావ సరస్వతమ్మ (78) గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బైపాస్ సర్జరీ అనంతరం రెండు నెలలుగా ఆస్పత్రిలోనే వైద్య సేవలు పొందుతున్న సరస్వతమ్మ గురువారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో ఆరోగ్యం విషమించటంతో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయాన్ని దోమలగూడలోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు ఆమెకు నివాళులర్పించారు. సరస్వతమ్మ అభ్యుదయ, ప్రజాతంత్ర, ఉపాధ్యాయ ఉద్యమాలకు చావ రవిలాంటి గొప్ప నాయకుడిని అందించారని కొనియాడారు. మరణానంతరం తన నేత్రాలను, శరీరాన్ని కూడా దానం చేసిన ఆమె ఆదర్శంగా నిలిచారని నివాళులర్పించారు. రవితోపాటు ఇతర కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆలోచనలను, ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
సరస్వతమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, బండారి రవికుమార్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఐద్వా రాష్ట్ర నాయకురాలు జ్యోతి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, ఎస్వీ రమ, కార్యదర్శులు జె.వెంకటేశ్, ఎం.పద్మశ్రీ, భూపాల్, పి.జయలక్ష్మి, కూరపాటి రమేశ్, ఏజే రమేశ్, బి.మధు, కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, ఆవాజ్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్బాస్, ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, రాష్ట్ర కార్యదర్శులు సింహాచలం, వెంకటప్ప, విశాలి, ఆఫీస్ మేనేజర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజారాం, శ్యాంసుందర్, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జంగయ్య, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు తదితరులున్నారు.
వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, నాయకులు ముజీబ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, భిక్షం గౌడ్, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, హైదరాబాద్ టీఎన్జీవోల అధ్యక్షులు కృష్ణ యాదవ్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేశ్, ఎస్టీఎఫ్ఐ మాజీ ఉపాధ్య క్షురాలు సంయుక్త తదితరులు సరస్వతమ్మ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జీవితాంతం సమాజ హితం కోరిన సరస్వతమ్మ తన మరణాంతరం వైద్య విద్యార్థుల కోసం శరీరాన్ని దానం చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆమె భౌతిక కాయాన్ని సనత్ నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. కాగా గురువారం సాయంత్రం నేత్రదానం చేసిన సరస్వతమ్మ కండ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకు వైద్యులు సేకరించి భద్రపరిచారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవికి మాతృ వియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


