పిల్లల ఆరోగ్య రక్షణకు టీకాలు..

– బేగంబజార్ ఫిహెచ్ఎన్ నాగేశ్వరమ్మ
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ప్రభుత్వ బేగంబజార్ 24 గంటల ఆసుపత్రిలో ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తున్నామని బేగంబజార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పిహెచ్ ఎన్ నాగేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ..  వ్యాక్సినేషన్ లు 90శాతం వ్యాధుల నం దూరం చేస్తుందన్నారు. చిన్నారులకు పుట్టినప్పటి నుంచి 10ఏండ్ల వయస్సు వరకు ఇచ్చే రెగ్యులర్ టీకాలు వారి ఆరోగ్య రక్షణకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అంటు వ్యాధులు, ఇతర భయంకర వ్యాధులు రాకుండా ముందస్తు టీకాలు వేయడం తప్పనిసరి అన్నారు. పుట్టినప్పటి నుంచి 10 ఏండ్ల వయస్సు వరకు దశలవారీగా వారికి టీకాలు ఇప్పించాలని చిన్నపిల్లల తల్లిదండ్రులకు సూచించారు.  ప్రభుత్వ దవాఖానల్లో పూర్తిగా ఉచితంగా టీకాలు అందిస్తామన్నారు. పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా  ప్రభుత్వం పెంటా వ్యాక్సిన్ ను కూడా ప్రవేశ పెట్టినట్లు వివరించారు. ఐదు వ్యాక్సిన్ల సమూహాన్ని పెంటా వ్యాక్సిన్ అన్నారు.  డిఫ్తీరియా (డి), టెటనస్ (టి), పెర్టసిస్(పీఏ), హెపటైటిస్-బి, హిబ్ అనే ఐదు రకాల వ్యాక్సిన్లు ఉంటాయన్నారు. ఈ పెంటా వ్యాక్సిన్ వేయడం వల్ల  డిఫ్తీరియా వంటి భయంకర వ్యాధులతో పాటు కామెర్లు రాకుండా, పిల్లలకు గాలి, దుమ్ము తదితరాలతో ఏర్పడే తట్టు (అమ్మతల్లి) వంటి ఇన్ఫెక్షన్ల బారీ నుంచి రక్షణ ఇస్తాయన్నారు. సకాలంలో ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తే పిల్లలకు ఎలాంటి వ్యాధు లు సోకకుండా ఉంటారని పేర్కొన్నారు. కొంత మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు వ్యాక్సిన్లు వేయించడంలో అశ్రద్ధ చేయడం, నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని చెప్పారు. దీని వల్ల పిల్లలు వ్యాధులకు గురై తీవ్ర అనారోగ్యం పాలవుతున్నట్లు ఆయన తెలిపారు. సకాలంలో వ్యాక్సినేషన్ చేయిస్తే 90. శాతం వ్యాధుల నుంచి పిల్లలను సంరక్షిం చుకోవచ్చని అన్నారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాం లో ప్రతి బుధవారం, శనివారం చిన్నారులకు వ్యాక్సిన్లను ఉచితం గా పంపిణీ చేస్తామన్నారు.  అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నామన్నారు.  చిన్నపిల్లలకు బస్తిదవాఖానల్లో కూడా వ్యాక్సిన్లు టీకాలను ఉచితం గా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ శైలజ. ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love