- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సత్యసాయి జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. హిందూపురం రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపైకి వచ్చిన రెండు ఆవులను రైలు ఢీకొంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో లోకోపైలట్ రైలును నిలిపివేశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆవుల కళేబరాలను తొలగించి, రైలు సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాత, దాదాపు అరగంటకు రైలు తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
- Advertisement -



