ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతోనే అభివృద్ధి: ఎంపీ డాక్టర్ కడియం కావ్య
నవతెలంగాణ-వర్ధన్నపేట
గత 10 సంవత్సరాలలో వర్ధన్నపేట అభివృద్ధి చెందలేదని తాను ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే డాక్టర్గా పనిచేశానని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నాయకత్వంలో నే వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి -ప్రణాళికలో భాగంగా రైతు వారం’ కార్యక్రమంలో నిర్వహించారు. వర్ధన్నపేట పట్టణ శివారులోని ఆకేరు వాగుపై నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్‌ను వరంగల్ ఎంపీ కడియం కావ్య,, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు లుప్రారంభించారు. గతంలో ఆకేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ దెబ్బతినడంతో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సుమారు రూ.46 లక్షల తో నూతన చెక్ డ్యామ్‌ను నిర్మించారు.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, గతంలో తాను ఇక్కడే డాక్టర్గా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేశానని ఇలాంటి అభివృద్ధి లేదన్నారు. ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు నాయకత్వంలోనే ప్రజా ప్రభుత్వంలో దశలవారీగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే నిధుల కోసం అందర్నీ కలుస్తున్నారన్నారు. తాను పర్వ దగ్గరికి చెందిన వర్ధన్నపేట నియోజకవర్గ బిడ్డనే అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు తాను తప్పకుండా సహకరిస్తానన్నారు. వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్న కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో సాగునీటి వనరుల అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల వర్షాకాలంలో ప్రవహించే నీరు నిల్వ ఉండి, భూగర్భ జల మట్టం పెరుగుతుందని, తద్వారా సమీప గ్రామాల్లోని బావులు, బోర్లు నీటి నిల్వలు పెరుగుతాయి అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. చెక్ డ్యామ్‌లు, కాల్వలు, చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని అభివృద్ధి చేపడుతుందన్నారు. ఆకేరు వాగుపై నిర్మించిన ఈ చెక్ డ్యామ్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సారంగపాణి, వైస్ చైర్మన్ శోభారాణి, ఇరిగేషన్ ఎస్ ఈ రాంప్రసాద్, ఇ ఇ కిరణ్ కుమార్, డి ఈ రాజు, ఏ ఈ అమర్నాథ్ , శ్రీధర్ , వర్ధన్నపేట తహసిల్దార్ విజయ సాగర్ ,మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలుటెంపుల్ చైర్మన్ కమ్మ గొని ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, పార్టీ నాయకులు గుంటి కుమార్ స్వామి,పోశాల వెంకన్న, పట్టణ నాయకులు ఏం డి అప్సర్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



