అమాంతంగా పెరిగిన కూరగాయల ధరలు..

– సామాన్యులకు ఇక తమాటా కరువే..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కూరగాయల మార్కేట్ లో టమాటా ధర అమాంతంగా పెరగడంతో సామాన్యులకు కూరగాయలు,  తమాటా ఇక కరువే అన్నట్టుగా ధర అకాశాన్ని అంటింది. రెండు వారాల క్రితం హోల్ సెల్  మార్కేట్ లో మంచిరకం తమాటా పది, ఎనమిది రూపాయలకు జనాలు కొన్నారు. అంతకు ముందు రెండు  నుండి ఐదు పలికింది. ప్రస్తుతం రెండు వారాలుగా ఇంతింతై మూడింతలైనట్లు  రోజు రోజుగా అమాంతంగా  కేజీ వంద రూపాయల వరకు పెరుగుతోంది. పేదలు కూరగాయలలో టమాటా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంచుతారు. ప్రస్తుతం కూరగాయలు  కొనలేక, తినలేక పోతున్నామని  మద్యతరగతి  కుటుంబాల వారు వాపోతున్నారు. ఇలాగైతే కూరగాయలకు బైబై చెప్పేసి, ప్రస్తుతం పప్పుల కూరనే వండుకుంటున్నామని మార్కేట్ లో మహిళలు తెలిపారు. దింతో  పాటు ఉల్లి ధర గట్టెక్కింది. కిలో  ఉల్లిగడ్డ ప్రస్తుతం యాబై రూపాయలకు చేరింది. వంకాయ నలభై, బెండకాయ అరువై, పచ్చిమిర్చి ఎనబై, ఆకు కూరల ధరలు కూడా పెరగడం, ప్రస్తుతం కూరగాయల ధరలు పై విధంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం తమాట, ఉల్లి, కూరగాయల ధరలను అదుపుచేసి నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love