జోరుగా ఉపాధిహామీ పనులు 

  • పని ప్రదేశంలో తాగునీటి వసతి 
  • అత్యవసర సమయంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ
  • కార్మికులకు అందుబాటులో మెడిసిన్ కిట్లు 
  •  ఫీల్డ్ అసిస్టెంట్ కనకయ్య 
నవతెలంగాణ దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండలంలోని పద్మనాభునిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి.  దాదాపుగా ఒక్క రోజు 135  మంది కూలీలు పనులకు హాజరవుతుంటారని ఫీల్డ్ తెలుపుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తైన ఈనేపథ్యంలో కూలీలు ఉపాధి పనుల వైపు పెద్ద ఎత్తున దృష్టి సారించారు. నిత్యం పనులు చేస్తూ ఉపాధి పొందుతూ జీవనం గడుపుతున్నారు.
నెలకు ఉపాధి కార్మికులకు 11,13,750 రూ.. ఆదాయం
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో లెవలింగ్, ఎంఐ ట్యాగ్, హరితహారం, క్రీడా ప్రాంగణం, నర్సరీ ,పార్క్, ప్లాంటేషన్ తో పలు రకాల పనులు గ్రామస్తులు  ఉపాధి పనులు చేస్తూ… సగటు ఒకరోజున 275 పొందుతుండగా…నెలకు 11,13,750 రూ.. వారి ఖాతాలో జమ అవుతున్నాయి.ఇక పని ప్రదేశంలో అన్నిరకాల వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు, నిర్వహకులు చెబుతున్నారు.ప్రతి ఏటా ఎండాకాలంలోనే అత్యధికంగా ఉపాధి పనులు చేస్తుంటారు. అయితే దేశంలో  తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా వరి, ఇతర పంటల సాగు కాగా… కూలీలకు వ్యవసాయ పనులే పుష్కలంగా లభించాయి. రాష్ట్రంలో సగటున రోజుకు 12 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఒక్కో కూలీకి సగటున రూ.174 వరకు చెల్లిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కూలీల కోసం ప్రస్తుతం 4.92 లక్షల పనులను గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేసి ఉంచింది. వీటిలో 4.76లక్షల పనులు కొనసాగుతున్నాయి.
ఉపాధి హామీ పథకం సద్వినియోగం
– ఫీల్డ్ అసిస్టెంట్ కనకయ్య

గ్రామంలోని నిత్యం 135 మంది 100 రోజుల ఉపాధి హామీ పనులను వినియోగించుకుంటున్నారు. 10 మందిని కలిపి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి రోజుకు అందరికీ పని కల్పిస్తున్నాం. పని ప్రదేశంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉపాధి పొంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చొరవతోనే ప్రజలు ఈ పనులపై శ్రద్ధ వహిస్తున్నారు.
 పని చేసి పైసలు తీసుకుంటున్నాం
 – పద్మ ,నాభునిపల్లి ఉపాధి కార్మికులు
గ్రామంలో పలు రకాల పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్నాం. గ్రామ సుందరీకరణకు అభివృద్ధి భాగస్వామ్యలమవుతున్నాం. పల్లె ప్రగతితో గ్రామంలో మంచి వాతవరణం నెలకొంది. రోజు ఉపాధి హామీ పనులు చేస్తూ పైసలు తీసుకుంటున్నాం. ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో అందరికీ పని దొరుకుతుంది. ఈ నిర్ణయంతో రైతుల ఖర్చు తగ్గనుంది. ప్రతి ఒక్కరూ ఉపాధి పనిపై ఆసక్తి చూపుతున్నారు.
Spread the love