బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని అడ్డగించిన గ్రామస్తులు

బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని అడ్డగించిన గ్రామస్తులు– పథకాలపై నిలదీత
నవతెలంగాణ-నంగునూరు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్‌ గ్రామానికి ప్రచారం నిమిత్తం వచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకులను సోమవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రచార రథం గ్రామానికి చేరగానే మాజీ సర్పంచ్‌ ఎల్లంకి గీత భర్త వెంకట్‌రెడ్డి, కొందరు కలిసి రైతుల రుణమాఫీ కాలేదని నాయకులను నిలదీశారు. బీసీబంధుకు ఇష్టానుసారంగా ఎంపిక చేశారని ఆరోపించారు. కొందరికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రశ్నించారు. వారిని మాజీ ఎంపీటీసీ మంజుల భర్త రేకులపల్లి సంతోష్‌రెడ్డి నెట్టేయడంతో గొడవ ప్రారంభమైంది. సమాచారం అందుకున్న రాజగోపాల్‌పేట ఎస్‌ఐ మోహన్‌ రెడ్డి పోలీసులతో గ్రామానికి చేరుకున్నారు. ఎవరైనా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Spread the love