– 4 ఏండ్ల నిషేధం విధించిన నాడా
న్యూఢిల్లీ : భారత జావెలిన్ త్రోయర్ డిపి మనుపై నాడా (నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) వేటు వేసింది. 2024లో బెంగళూర్‌లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీలో డిపి మను 81.91 మీటర్ల త్రోతో టైటిల్ సాధించాడు. కాశీనాథ్ నాయక్ శిక్షణలో తర్ఫీదు పొందిన డిపి మను బెంగళూర్ ఈవెంట్ తర్వాత మరో రెండు టోర్నమెంట్లలో పోటీపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన డిపి మను (25) 2023 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. బుదాపెస్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. ఇండియన్ గ్రాండ్ ప్రీ 1లో డిపి మను శాంపిల్స్ సేకరించగా.. అతడి శాంపిల్‌లో అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ అవశేషాలు ఉన్నట్టు తేలింది. దీంతో మనుపై 4 ఏండ్ల నిషేధం విధిస్తూ నాడా నిర్ణయం తీసుకుంది.