Monday, June 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యకాస, కేవీపీఎస్ లది 
తల్లి బిడ్డల సంబంధం : స్కైలాబ్ బాబు

వ్యకాస, కేవీపీఎస్ లది 
తల్లి బిడ్డల సంబంధం : స్కైలాబ్ బాబు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్
వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష పోరాట సంఘం మధ్య బంధం తల్లీ బిడ్డల బంధమని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలో ఆయన సౌహార్ద సందేశాన్ని ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక పోరాటాలను జమిలీగా నడపాలని పిలుపునిచ్చారు. ఓవైపు సరళీకృత ఆర్థిక విధానాలతో మరోవైపు మనువాద భావజాలాన్ని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం శిఖండి పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. దేశంలోని కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోడీ సర్కారు, ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం తీసుకొచ్చిన సబ్ ప్లాన్ ను రద్దు చేసిందని విమర్శించారు.

​వ్యవసాయ కార్మిక సంఘానిది పెద్దన్న పాత్ర : ఆశయ్య
గ్రామీణ పోరాటాల్లో వ్యవసాయ కార్మిక సంఘానిది పెద్దన్న పాత్ర అని చేతివృత్తుదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య అన్నారు. ఆర్థిక సరళీకృత విధానాల వల్ల గ్రామాల్లో చేతివృత్తులు దెబ్బ తిన్నాయని, దీంతో వృత్తిదారులు కూడా కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కూలి, భూ, ఉపాధి పోరాటాలకు అండగా ఉంటామని, వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలలో భాగస్వాములమవుతామని చెప్పారు.

​ గిరిజనులకు పోడు పట్టాలివ్వాలి: ధర్మానాయక్
తెలంగాణలో పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నేటికీ అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు విద్య వైద్యం ఉపాధి వంటి అవకాశాలు దక్కడం లేదని వాపోయారు. కార్పొరేట్లకు ఖనిజ సంపదను కట్టబెట్టేందుకు గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టడం దారుణం అన్నారు. రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యవసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -