Thursday, August 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్తరగతి గదిలోకి నీరు.. విద్యార్థులు ఇబ్బందులు

తరగతి గదిలోకి నీరు.. విద్యార్థులు ఇబ్బందులు

- Advertisement -

నవతెలంగాణ-బజార్ హత్నూర్
కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా మండలంలోని మంజీరం తండా పాఠశాల భవనం స్లాబ్ నుంచి నీరు చినుకుల్లా కారడంతో తరగతి గదిలోకి వర్షపు నీరు చేరింది. దీంతో విద్యార్థులు తడుస్తూ పాఠాలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతి గదిలో నేలంతా నీరు నిలవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పాఠశాల భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్య అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -