Wednesday, May 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహెచ్‌సీయూలో విద్యార్థులపై ఏబీవీపీ దాడిని ఖండిస్తున్నాం

హెచ్‌సీయూలో విద్యార్థులపై ఏబీవీపీ దాడిని ఖండిస్తున్నాం

- Advertisement -

దాడులకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో థియేటర్‌ విభాగానికి చెందిన విద్యార్థులు సోమవారం నాడు ”హోలీ” నాటకాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో అక్కడున్న విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఖండించారు. అది అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. నాటకాన్ని వీక్షించేందుకు విద్యార్థులు హాజరైన సమయంలో ఏబీవీపీ గుంపు ముందస్తు ప్రణాళికతో వచ్చి బీర్‌ బాటిళ్లు, రాళ్లు, కర్రలతో హింసకు పాల్పడిందని విమర్శించారు. ఆ దాడిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో పాటు పలువురు విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. ఎన్నికైన విద్యార్థి యూనియన్‌ సభ్యులే ఈ దాడులకు నాయకత్వం వహించడం శోచనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మతోన్మాద విద్యార్థి నాయకులు విస్మరించారనీ, భావ వ్యక్తీకరణకు భంగం కలిగించడం దుర్మార్గమని విమర్శించారు. క్యాంపస్‌ లో హింసకు పాల్పడిన ఏబీవీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలనీ, గాయపడిన విద్యార్థులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -