Wednesday, May 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమొక్కజొన్నతో పాటు జొన్నలనూ కొంటాం

మొక్కజొన్నతో పాటు జొన్నలనూ కొంటాం

- Advertisement -

సబ్‌ కమిటీలో నిర్ణయం : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దష్టిలో ఉంచుకుని, మొక్కజొన్న పంటతో పాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సబ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటనిస్తుందని తెలిపారు. సీఎంకు, సబ్‌ కమిటీ సభ్యులకు రాష్ట్ర రైతుల తరపున మంత్రి కతజ్ఞతలు తెలిపారు. మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్‌ఎస్‌ పరిధిలోకి తీసుకుని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఏ రాష్ట్రంలోనూ మొక్కజొన్న, జొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదనీ, అక్కడి రైతులు బహిరంగ మార్కెట్లో లభించిన ధరలకే తమ పంటను అమ్ముకుంటున్నారని మంత్రి తెలిపారు. అయితే తెలంగాణలో మాత్రం రైతుల శ్రేయస్సును దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వచ్చి పంటలను కొనుగోలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. 278 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నను సేకరించినట్లు వెల్లడించారు. గత సీజన్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.76 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయం భరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటల కొనుగోళ్ల కోసం దాదాపు రూ.6000 కోట్ల వరకు వ్యయం చేసినట్టు తెలిపారు. రైతుల ఆదాయ భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -