Tuesday, August 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు92,87,577 మంది ఓటర్లకు నోటీసులు

92,87,577 మంది ఓటర్లకు నోటీసులు

- Advertisement -

సెప్టెంబర్‌ 16 ‌వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్‌ 15 ‌లోగా ఫిర్యాదుల పరిష్కారం
తెలంగాణ ఓటర్లు 2,64,87,213
ముసాయిదా జాబితా విడుదల
అనామలిస్‌‌ కేటగిరి ఓటర్లు 60,50,918
2002 సర్‌‌తో మ్యాపింగ్‌ ‌కాని వారు 32,36,659
తొలగించిన ఓట్లు 73,39,235
నోటీసులందిన వారు నిర్దేశించిన 11 ఆధారాలు సమర్పించాలి
కొత్త ఓటర్లు, ఓటు కోల్పోయిన వారు
ఫాం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
వివరాలు వెల్లడించిన సీఈఓ సుదర్శన్‌‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ‌సోమవారం హైదరాబాద్‌‌లోని బీఆర్కే భవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. నిర్దేశిత గడువు ఆగస్టు 10 వరకు ఎన్యూమరేషన్‌ ‌ఫారాలను ఎన్నికల సంఘానికి అందజేసిన 2,64,87,213 మంది ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చినట్టు తెలిపారు. పూర్తి జాబితాను ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో 78.30 శాతం మంది మాత్రమే డ్రాఫ్ట్‌‌ లిస్టులో ఉన్నారని వివరించారు. ఇందులో 60,50,918 మంది ఓటర్లు అనామలిస్‌ ‌కేటగిరిలో, 2002 సర్‌‌తో మ్యాపింగ్‌ ‌కాని వారు 32,36,659 మంది, మొత్తం 92,87,577 మంది ఓటర్లకు నోటీసులు అందజేయనున్నట్టు తెలిపారు. 119 మంది ఎలక్షన్‌ ‌రిటర్నింగ్‌ అదికారులు(ఈఆర్‌ఓ), 890 మంది అసిస్టెంట్‌ ఎలక్షన్‌ ‌రిటర్నింగ్‌ అదికారి(ఏఈఆర్‌ఓ)లు బీఎల్‌ఓల ద్వారా వీరికి నోటీసులు అందజేస్తారని పేర్కొన్నారు. ఏ కారణంతో నోటీసు జారీ చేశామో ఈసీఐ ఫార్మట్‌‌లో స్పష్టంగా తెలియజేస్తామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ ‌కార్డులు, జన్మ ధృవీకరణ పత్రం, పాస్‌ ‌పోర్ట్‌, టెన్త్‌ సర్టిఫికెట్‌, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, భూమి/ఇంటి కేటాయింపు మొదలగు 11 డ్యాక్యుమెంట్లను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఓటు తొలగింపుపై వచ్చిన అభ్యంతరాలను ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు పరిశీలించనున్నట్లు వెల్లడించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ సర్కార్‌ ‌కొత్తగా జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్‌ ‌సర్టిఫికెట్‌ ‌చెల్లదని స్పష్టం చేశారు. ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓల సంఖ్యను మరో 500 మందిని పెంచాలని ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. గడువు పెంపు, సిబ్బంది పెంపుపై తుది నిర్ణయం ఈసీఐదేనని స్పష్టం చేశారు. తెలంగాణలో మాత్రమే భారీ సంఖ్యలో ఓట్లను తొలగించారనే ఆరోపణలను ఆయన తోసి పుచ్చారు. ఇప్పటి వరకు సర్‌ ‌పూర్తయిన తమిళనాడు, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఇక్కడి కంటే ఎక్కువ ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. ఈసీఐ నిబంధనల ప్రకారమే ఓట్లను తొలగించామనీ, ఇందులో ఎవరి ప్రమేయం లేదని పేర్కొన్నారు. ఎవరి ఓట్లయినా లేకపోతే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రాష్ర్టంలోని గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముసాయిదా జాబితా సీడీలను అందజేసినట్టు సుదర్శన్‌‌రెడ్డి తెలిపారు. పరిశీలన, క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు చురుగ్గా పాల్గొనాలని సుదర్శన్‌‌రెడ్డి కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలన్నారు. ఓటర్ల జాబితా ఖచ్చితమైనదిగా, పారదర్శకంగా రూపొందించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త ఓటుకు ఫారం 6….
అక్టోబర్‌ 1 ‌నాటికి లేదా అంతకు ముందే 18 ఏండ్లు నిండిన యువ ఓటర్లతో పాటు ఓటు వివిధ కారణాల వల్ల ఓటు రాని వారు నిర్దేశిత డిక్లరేషన్‌తో కూడిన ‘ఫారం-6’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీలు కాని సందర్భంలో ఆన్‌‌లైన్‌ ‌ద్వారా ఓటర్‌ ‌నమోదు ఫారాలను డౌన్‌‌లోడ్‌ ‌చేసుకుని వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు. నివాసం మార్చినప్పటికీ తమ పాత నియోజకవర్గంలోనే నమోదై ఉన్న ఓటర్లు, చిరునామా మార్పు తర్వాత ఓటరు నమోదును వలస లేదా బదిలీ చేయడానికి ఉద్దేశించిన ఫారం 8ని ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపేన్‌కు సంబంధించి షెడ్యూల్‌‌ను ప్రకటిస్తామన్నారు.

రెండు దశల్లో అప్పీల్‌….
​పూర్తి వివరాలు సమర్పించని ఓటర్ల విషయంలో ఈఆర్‌‌వో, ఏఈఆర్‌‌వోలు విచారణ చేస్తారని తెలిపారు. విచారణ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అయినా జాబితాపై అభ్యంతరాలుంటే ఎలక్ష‍న్‌ ‌రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌‌వో) తీసుకున్న ఏ నిర్ణయంపైనైనా ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 24(a) ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌‌కు అప్పీల్ చేయవచ్చన్నారు. మొదటి అప్పీల్ అధికారి నిర్ణయంపై 25 24(b) ప్రకారం రిజిస్ర్టేషన్‌ ఆఫ్‌ ఎలక్ష‍న్‌ ‌రూల్స్‌ 1960లోని రూల్‌ 27 ప్రకారం ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)కు రెండో అప్పీల్ చేసుకోవచ్చిని తెలిపారు.

​ఓటు తెలుసకోవడమేలా?
ముసాయిదా జాబితాలో తమ ఓటున్నదో లేదో తెలుసుకోవడనాకి ఈసీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://www.eci.gov.in/ను సందర్శించాలి. పైన ఉన్న SIR-2026 డౌన్‌‌లోడ్‌ ఎలక్ర్టోల్‌ ‌రోల్‌ పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత వచ్చిన విండోలో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌ ఎంచుకోవాలి. తర్వాత మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాష సెలక్ట్‌ చేసుకోగానే కింద ఓటరు జాబితాలు వరుస క్రమంలో కనిపిస్తాయి. అందులో మీ పార్ట్‌ నెంబర్‌, పేరును సెలక్ట్‌ చేసి పైన కనిపించే క్యాప్చాకోడ్‌ను ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయగానే.. మీ ఓటరు జాబితా పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ అవుతుంది. అందులో మీ సీరియల్‌ నంబర్‌తో లేదా మీ పేరు, ఎపిక్‌ నంబర్‌లతో చెక్‌ చేసుకోవచ్చు.

తొలగించిన వారి వివరాలు…
1). మరణించిన వారు 9,22,230
2). శాశ్వతంగా వలస వెళ్లిన వారు 45,18,961
3). ఆచూకీ లభించని ఓటర్లు 11,25,546,
4). ఇప్పటికే ఎన్‌‌రోల్‌ అయిన ఓటర్లు 6,70,203
5) ఇతరులు 1,02,294
మొత్తం తొలగించిన ఓట్లు 73,39,234



జిల్లా పేరు సర్‌‌కు ముందు సర్‌ ‌తర్వాత తొలగించిన ఓట్లు
1).ఆసీఫాబాద్‌ 4,55,596 4,07,457 48,139
2). మంచిర్యాల 6,61,467 5,46,999 1,14,468
3). అదిలాబాద్‌ 4,66,784 4,03,625 63,159
4). నిర్మల్‌ 7,55,344 6,42,174 1,13,170
5).నిజామాబాద్‌ 14,39,734 12,28,064 2,11,670
6).కామారెడ్డి 6,96,006 6,11,738 84,268
7).జగిత్యాల 7,21,,032 6,46,294 74,738
8).పెద్దపల్లి 7,12,157 6,31,018 81,139
9).కరీంనగర్‌ 10,89,090 9,11,988 1,77,102
10). సిరిసిల్ల 4,75,694 4,17,127 58,567
11).సంగారెడ్డి 14,57,436 11,59,158 2,98,278
12).మెదక్‌ 4,53,140 4,10,204 42,936
13).సిద్దిపేట 9,92,967 8,74,181 1,18,786
14).రంగారెడ్డి 36,99,743 24,12,652 12,87,091
15). వికారాబాద్‌ 10,17,671 8,07,374 2,10,297
16).మేడ్చల్‌ ‌ 29,79,130 19,07,564 10,71,566
17).హైదరాబాద్‌ 47,36,669 27,95,225 19,41,444
18).మహబూబ్‌‌నగర్‌ 7,32,488 6,29,402 1,03086
19).నాగర్‌ ‌కర్నూల్‌ 7,31,632 6,18,592 1,13,040
20).వనపర్తి 2,75,570 2,37,006 38,564
21). గద్వాల 5,03,859 4,39,934 63,925
22).నల్లగొండ 15,16,253 13,57,618 1,58,635
23).సూర్యపేట 10,08,252 9,11,945 96,307
24).యాదాద్రి 4,59,943 4,33,822 26,121
25).జనగాం 7,67,484 7,03,593 63,891
26).మహబూబాబాద్‌ 4,84,935 4,36,956 47,979
27). వరంగల్‌ 7,76,953 6,78,540 98,413
28).హన్మకొండ 5,09,014 4,07,317 1,01697
29).భూపాల్‌‌పల్లి 2,77,882 2,41,964 35,918
30).కొత్తగూడెం 9,96,198 8,63,413 1,32,785
31).ఖమ్మం 12,43,781 10,85,927 1,57,854
32).ములుగు 2,36,970 2,09,128 27,842
33).నారాయణపేట 4,95,574 4,19,214 76,360
………………… ………………… …………………
మొత్తం 3,38,26,448 2,64,87,213 73,39,235
………………….. ………………… …………………

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -