సాగు, తాగు నీరు సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలి..

We need to prepare for the struggle for cultivation and drinking water.– ప్రాజెక్టుల పూర్తి కోసం అధిక నిధులను కేటాయించాలి..
– మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వం..
– కార్మికుల పొట్టలు కొట్టి ..కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం..
– కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి..
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు నియోజకవర్గంలో సాగు తాగునీరు లేక అల్లాడుతున్న రైతులకు, ప్రజలకు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేంతవరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కాల్వలపల్లి గ్రామంలో ఎర్ర గోపాల్ నగరంలో నిర్వహించిన ఎనిమిదవ సీపీఐ(ఎం) పార్టీ మండల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు,  దేవరకొండ  ప్రాంతంలోని ప్రజలు అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారికి అవసరమైన  సాగు, తాగు నీరు లేకపోవడంతో వర్షంపై ఆధారపడి పంటలు సాగుచేసిన రైతులకు సరైన సాగు రాక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వచ్చినప్పుడు కొద్దిగా మనకు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలించాల్సిన బీజేపీ  మత విదేశాలను రెచ్చగొడుతూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు పెత్తందారులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని ఆగదుర వ్యక్తం చేశారు. పేద ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసి కార్పొరేట్ శక్తులకు కట్ట పెట్టడం సిగ్గుచేటని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో  ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అధిక నిధులను కేటాయించాలని కోరారు. మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు  డిండి ఎత్తిపోతల పథకం ,చర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం మాట్లాడుతూ మునుగోడు మండలంలోని వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రోడ్డు మార్గం ఉన్న ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో సిసి రోడ్లు మురికి కాలువ నిర్మాణం సక్రమంగా లేక ప్రజలు అనారోగ్య పాడిన పడుతున్నారని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం మురికి కాల్వలను  నిర్మాణం చేపట్టేందుకు గ్రామాలలో  అధికారులపై అనేక ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మండల మహాసభల  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై పోరాటాల నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు . యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి యుక్త వయసులో జేలు జీవితాలను అనుభవిస్తున్నారని అన్నారు. చెడు వ్యసనాల అలవాటు పడకుండా ప్రజలకు అవసరమైన పోరాటాల వైపు ఉండి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ మహాసభ సాగర్ల మల్లేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్,మండల కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు వేముల లింగస్వామి, యాట యాదయ్య, వడ్లమూడి హనుమయ్య, శివర్ల వీరమల్లు, పగడాల కాంతయ్య, కొంక రాజయ్య, ఎట్టయ్య, దొండ వెంకన్న, కట్ట లింగస్వామి, వంటెపాక అయోధ్య,  పి పరమేష్, పగిళ్ల సైదులు, పి మధు తదితరులు ఉన్నారు.
Spread the love