టీపీసీసీ ప్రచార కమిటీ
చైర్మెన్ మధుయాష్కి గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్
బీజేపీ పాలనలో ప్రలోభానికి గురవుతున్న న్యాయవ్యవస్థను కాపాడుకోవల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా రెండోసారి ఘనవిజయం సాధించిన సీనియర్ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వెంకట్ యాదవ్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుదూ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులను సమీకరించి ఎంతో కీలకంగా పోరాటం చేసిన చలకాని వెంకట్ యాదవ్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా రెండోసారి గెలుపొందడం అభినందనీయమన్నారు. గతంలో హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారని గుర్తు చేశారు. బార్ కౌన్సిల్ సభ్యులుగా పేద వర్గాలకు అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు ఇచ్చిన హామీలను అమలుకు వెంకట్ యాదవ్ కృషి చేయాలన్నారు. ఇందుకు తన వంతుగా సహకారం అందిస్తానని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యధికంగా నష్టపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలేనన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. చలకాని వెంకట్ యాదవ్ గారు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హాయంలో హైకోర్టు, జిల్లా కోర్టులలో స్టాండింగ్ కౌన్సిల్, జేపీ తదితర పోస్టులలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి న్యాయం చేయాలని మధుయాష్కి పట్టుబట్టి 42 శౄతం కోటా ఇప్పించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెలికంటి సత్యం , ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ , పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ శ్రీనివాస్ , స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు , అఖిల భారత యాదవ సంఘం నేషనల్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పాలనలో ప్రలోభానికి గురవుతున్నన్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



