తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాలు రహిత రాష్ట్రంగా మా వంతు సహకారం అందజేస్తాం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర,  ఇందుర్ న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రి డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో పదవ వార్షిక తెలంగాణ రాష్ట్ర సైకియాట్రిక్ మహాసభలు శనివారం డిచ్ పల్లి మండలం లోని బర్దిపూర్ శివారు లోని కృష్ణ హోటల్లో నిర్వహించారు. ఈ మహాసభలు మూడు రోజుల పాటు కోనసాగనున్నాయి.రెండవ రోజు శనివారం ముఖ్య ఘట్టం మహాసభల ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీకాంత్రాటి, గౌరవ అతిథులుగా ఎమ్మెల్సీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులందరూ కలిసి మత్తు పదార్థాలు దాని చికిత్స విధానంపై అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా బెంగళూరు నుంచి డాక్టర్ ప్రతిమామూర్తి, కరీంనగర్ నుంచి డాక్టర్ కిషన్  పాల్గొని మత్తు  పదార్థాల దుష్పపరిణామాలు పై వివరించారు  ఈ సభలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలపై అవగాహనను ఇస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర సైకియాట్రిక్ అసోసియేషన్ బృందానికి, ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లను అభినందించారు.  ఇంతే కాకుండా కమిటీ సభ్యులందరూ కూడా రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాలు రహిత రాష్ట్రంగా మా వంతు సహాయ సహకారం అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదే రోజు నూతన కార్యవర్గ బాధ్యతలను డాక్టర్ మిన్హాజ్ నజీరాబాద్ నూతన అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ అశోక్ అలించంద్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సైకియాట్రిక్ అసోసియేషన్, ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రి డాక్టర్ విశాల్ ఆకుల డ్రక్స్ డి అడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో పదవ వార్షిక మహాసభల ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలంగాణ సైకియాట్రిక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి  డాక్టర్ విశాల్ ఆకుల,  వార్షిక మహాసభల  ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జార్జిరెడ్డి, డాక్టర్ ఫణికాంత్ బృందం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. మిన్హజ్ నాసిరాబది,డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ రవితేజ, డాక్టర్ ఆశ మౌనిక తదిత వైద్య సిబ్బంది పాల్గొని శిక్షణా తరగతులు నిర్వహించారు.
Spread the love