వైట్‌ కలర్‌ నేరాలపై మరింత దృష్టి సాధిస్తాం

– సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి
– వార్షిక నివేదిక వెల్లడి
నవతెలంగాణ-మియాపూర్‌
వైట్‌ కలర్‌ నేరాలపై మరింత దృష్టి సాధిస్తామని సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు. సైబరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలోని వార్షిక నివేదికను శని వారం ఆయన మీడియాకు వెల్లడిం చారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబరాబాద్‌ కమిష నరేట్‌ పరిధిలో గత ఏడాదితో పోలి స్తే సైబర్‌ క్రైమ్‌ కేసులు పెరిగాయని తెలిపారు. గతేడాది మొత్తంగా 4,850 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 5,342 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. ఈ ఏడాది రూ.232 కోట్ల ఆర్థిక మోసాలు చోటుచేసుకున్నా యని చెప్పారు. ఈ ఏడాది 277 డ్రగ్స్‌ కేసుల్లో 567 మందిని అరెస్టు చేశామని, ఈ ఏడాది రెండు పీడీ యాక్ట్‌ కేసులు కూడా నమోదు చేశామన్నారు. రూ. 27.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌ చేశామని, డ్రగ్స్‌ సరఫరాదారులతో పాటు విక్రేతలు, వినియోగదారుల పై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌ కేసుల్లో ఏ రంగానికి సంబం ధించిన వారున్నా చర్యలు తప్పవని హెచ్చరిం చారు. సైబరాబాద్‌ పరిధిలో ఆర్థిక, స్థిరాస్తి నేరాలు కూడా పెరిగాయని, అయితే ఇటీవల మహిళలపై నేరాలు తగ్గాయని స్పష్టం చేశారు. గతేడాది 2,489 కేసులు రాగా, ప్రస్తుతం 2,356 కే సులు నమోదు అయ్యాయని తెలిపారు. లైంగికదాడి కేసులు కూడా తగ్గాయని, మోసాలకు సంబంధించి 2022లో 6,276 కేసులు రాగా, ఈ ఏడాది 6,777 కేసులు వచ్చాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయని, హత్య కేసులు 2022లో 93 నమోదు కాగా, ప్రస్తుతం 105 కేసులు నమోదు అయ్యాయని, ఈ ఏడాది 52,124 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు ఆయునట్టు వివరించారు. నేరాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. డ్రగ్స్‌ను పూర్తిగా నివారిస్తా మన్నారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love