Sunday, May 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహమాలీ వర్కర్ల సంక్షేమం కోసం వెల్ఫేర్‌ బోర్డు

హమాలీ వర్కర్ల సంక్షేమం కోసం వెల్ఫేర్‌ బోర్డు

- Advertisement -

సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు డిమాండ్‌
అమెరికా ఒత్తిడితో పత్తి దిగుమతి సుంకం తొలగింపు
దేశ రైతాంగానికి తీవ్ర ప్రమాదం
ఉత్తేజపూరితంగా ఆల్‌ హమాలీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర మహాసభలు


నవతెలంగాణ-జనగామ
హమాలీ వర్కర్ల సంక్షేమం కోసం వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆల్‌ హమాలీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభ శనివారం జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా ఉత్తేజ పూరితంగా జరిగాయి.ఈ మహాసభ సందర్భంగా జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బొట్ల శ్రీనివాస్‌, ప్రాంగణం ఎర్ర శ్రీకాంత్‌ నగర్‌ పేరుతో మహాసభ జరిగింది. ప్రారంభ సూచికగా జెండా ఆవిష్కరణను మద్ది సత్యం చేశారు. మహాసభలకు అధ్యక్ష వర్గంగా భూక్య శ్రీనివాస్‌, రాపర్తి రాజు, సత్యం వ్యవహరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సాయిబాబు మాట్లాడుతూ హమాలీ కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక వెల్ఫేర్‌ బోర్డును తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అసంఘటిత రంగ కార్మికులుగా పని చేస్తున్న హమాలీలకు గుర్తింపు కార్డులు, పెన్షన్‌, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, గృహ వసతి, పిల్లల విద్యా సౌకర్యాలు కల్పిం చాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలోని మార్కెట్లు, గోదాములు, రవాణా రంగంలో పనిచేస్తున్న హమాలీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకకు కీలకంగా సేవలంది స్తున్నప్పటికీ వారికి కనీస సంక్షేమ సౌకర్యాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హమాలీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, కార్మికుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌ యార్డులు, గోదాములు, ఎగుమతి- దిగుమతి కేంద్రాల్లో పనిచేసే హమాలీలకు రక్షణ పరికరాలు, తాగు నీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యా లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా హమాలీలకు కనీస వేతనాల చట్టాన్ని కచ్చి తంగా అమలు చేయాలని, కాంట్రాక్టు మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలని, పని గంటలను నియంత్రించాలని కోరారు.

అమెరికా ఒత్తిడితోనే పత్తి దిగుమతిపై సుంకం తొలగింపు…
అమెరికా ఒత్తిడితోనే పత్తి దిగుమతిపైన సుంకం సుంకం తొలగించారని దీంతో దేశ రైతాంగానికి తీవ్ర ప్రమాదం అని ఎం. సాయిబాబు అన్నారు.దేశంలో ప్రస్తుత ఆర్థిక, కార్మిక, వ్యవసాయ పరిస్థితులపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి అనుగుణంగా పత్తి దిగుమతులపై ఉన్న రక్షణాత్మక సుంకాన్ని పూర్తిగా తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నా లను తీవ్రంగా ఖండించారు. రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని, పత్తి దిగుమతి సుంకాలను కొనసాగించాలని రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

​హమాలీకార్మికుల కోసం పోరాటం
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నది సిఐటియు మాత్రమేనని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహాసభలో తెలంగాణ అల్‌ హమాలీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రతినిధులు, సీఐటీయూ నాయకులు, వివిధ మార్కెట్‌ యార్డులు మరియు కార్మిక రంగాలకు చెందిన హమాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. .ఈ మహాసభలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు హమాలీ కార్మికుల సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. హమాలీ కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని మహాసభ పిలుపు నిచ్చింది.హమాలీల సంక్షేమం, కార్మిక హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రతా పథకాల అమలు, రైతు-కార్మిక ఐక్యత బలోపేతం తదితర అంశాలపై పలు తీర్మానాలను ఆమోదించారు. ఇంకా ఈ మహా సభలో ఆల్‌ హామాలి వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు కాసు మాధవి పుప్పాల శ్రీకాంత్‌ పాలడుగు సుధాకర్‌ రాష్ట్ర నాయకులు యాటల సోమన్న సిఐటియు జిల్లా కార్యదర్శి సుంచు విజయేందర్‌ వివిధ జిల్లాల నాయకులు గుమ్మడి రాజు నరేష్‌ దాసరి పాండు బోట్ల చక్రపాణి ఆరూరి కుమార్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యచందు నాయక్‌ మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మునిగేల రమేష్‌ సిఐటియు జిల్లానాయకులు నాయకులు అన్నెబోయిన రాజు బైరగోఁ బాలరాజు చిట్యాల సోమన్న బూడిది ప్రశాంత్‌ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి దసగోని సుమ ప్రజాసంఘాల నాయకులు దూసరి నాగరాజు కచ్చగాళ్ళ వెంకటేష్‌ చిర్ర శ్రీను పొదల నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -