బీఆర్ఎస్ ప్రభుత్వంతో సంక్షేమ పథకాలు

– ఇంటింటా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం
నవతెలంగాణ-మల్హర్ రావు : బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే సంక్షేమ పథకాలు అందుతాయని మండల బిఆర్ఎస్ నాయకులు అన్నారు.ఆదివారం ప్రచారంలో భాగంగా మండలంలో డబ్బగట్టు,మల్లారం,తాడిచెర్ల గ్రామాల్లో  కెసిఆర్ ప్రవేశపెట్టిన బిఆర్ఎస్ ఎన్నికల మేనిపేస్టో ఇకటింటా ప్రచారం విస్తృతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌కు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేయడం పుట్ట మధూకర్‌తోనే సాధ్యమవుతాయన్నారు.పేద అడబిడ్డలకు పెళ్లిళ్లు,నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటున్నారని చెప్పారు.మంథని గడ్డపై గులాబీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి కారు గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు,నాయకులు  చేప్యాల రామారావు,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,సర్పంచ్ పులిగంటి మమత నర్సయ్య,రాజేశ్వరరావు,  మండల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love