Thursday, August 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్ ఫాం హౌజ్ లో 
పండిన వరి ధర ఎంత?

కేసీఆర్ ఫాం హౌజ్ లో 
పండిన వరి ధర ఎంత?

- Advertisement -


మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

కేసీఆర్ ఫాం హౌజ్ లో పండిన వరికి ఎంత ధర వచ్చిందో రైతులకు చెప్పాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డిమాండ్ చేశారు. అసత్యాలతో ప్రజలను కేటీఆర్ పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి… ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.90 లక్షలకే ఇచ్చిన భూమిని కాంగ్రెస్ సర్కార్ కోటిన్నర రూపాయలకే కేటాయించిందని తెలిపారు. ఐదెకరాల భూమిని రూ.7.5 కోట్లకు ఇస్తే రూ.200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని కేటీఆర్ ను ప్రశ్నించారు. హిల్ట్ పాలసీతో హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందనీ, తాము ఈ విషయంలో రాజీ పడబోమన్నారు. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరై బలంగా పోరాడుతామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -