ఆలూను వండే క్రమంలో చాలాసార్లు అవి లోపల సరిగ్గా ఉడకవు, లేదా మరీ మెత్తగా పేస్ట్ లా మారిపోయి కూర ఆకారాన్ని పాడుచేస్తాయి. సరిగ్గా ఉడకకపోతే పొట్టు తీయడం కూడా కొన్నిసార్లు పెద్ద ప్రహసనంగా మారుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే, ఆలూ వంటకాల రుచి అమాంతం పెరిగిపోతుంది.
నీటిలో కొద్దిగా ఉప్పు వేయడం : ఆలు ఉడకబెట్టేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేయడం అవి దుంపల లోపలి వరకు వెళ్లి, దానికి చక్కని రుచిని ఇస్తుంది. అవి ఉప్పు నీటిలో ఉడకడం వల్ల తొక్క చాలా సులభంగా ఊడివస్తుంది. ఆలూ చాట్, ఫ్రై, కూరలు చేసేటప్పుడు ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది.
ప్రెషర్ కుక్కర్ లో నూనె చుక్కలు : కుక్కర్ లో బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ నూనె వేసి చూడండి. ఈ నూనె ఉడుకుతున్న ఆలూ చుట్టూ ఒక సన్నని పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల పొట్టు ఈజీగా రావడమే కాకుండా, అవి మరీ మెత్తగా చితికిపోకుండా, విడిపోకుండా ఉంటాయి. కట్లెట్లు, ఆలూ టిక్కీలు, సలాడ్స్ వంటి ఆకారం దెబ్బతినకూడని వంటకాలకు ఈ చిట్కా బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుంది.
నిమ్మరసం : మరుగుతున్న నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం పిండి ఉడకబెట్టడం అనేది మరో అద్భుతమైన పద్ధతి. నిమ్మరసంలోని స్వల్ప ఆమ్లత్వం ఆలు రుచిని పెంచడమే కాకుండా, ఉడికిన తర్వాత రంగు మారి నల్లబడకుండా కాపాడుతుంది. ఫ్రెష్ సలాడ్స్ తయారు చేసుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
బిర్యానీ ఆకులతో సువాసన : ఆలుకు మంచి సువాసన రావాలంటే ఉడకబెట్టే నీటిలో ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులను వేయండి. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రహస్యం. ఆకులు విడుదల చేసే సుగంధ పరిమళాలు వాటికి పట్టి, వాటికి ఒక రిచ్ ఫ్లేవర్ ను అందిస్తాయి.
వెనిగర్ తో సరైన ఆకృతి : ఆలు ఆకారం ఏమాత్రం చెదరకుండా ఉండాలంటే నీటిలో కొద్దిగా వెనిగర్ కలపడం బెస్ట్ ఐడియా. వెనిగర్ ఆలు పై పొరను గట్టిగా ఉంచుతుంది, తద్వారా లోపల ఉడికినా బయట చితికిపోదు.
దుంపలను ఉడికించేటప్పుడు…
- Advertisement -
- Advertisement -



