వీఆర్‌ఏల వెట్టి చాకిరికి విముక్తి ఎప్పుడు?

– సమ్మె సమయంలో 111 మంది మృతి
– ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులుగా జీవో జారీ
– సర్దుబాటు చేశారు జీతం మరిచారు
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా వీఆర్‌ఏలకు మాత్రం ఇంకా స్వాతంత్రం రానట్టే. స్వరాష్ట్రంలోనైనా న్యా యం జరుగుతుందేమోనని ఎంతగానో ఆశతో ఉన్న అది నిరాశగానే మిగిలిపోతుంది. 5 ఏండ్లు వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తే ప్రభుత్వం వీఆర్వోగా పదోన్నతి కల్పించేది. రాష్ట్రం ఏర్పడ్డ 7ఏండ్లకు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 2021 సంవత్సరంలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేసింది. నిజాం కాలం నాటి నుండి వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న వారికి ఎలాంటి పదోన్నతీ పొందే అవకాశం లేకుండా పోయింది. వ్యవస్థ ర ద్దు చేసే సమయంలో 4 ఏండ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వీఆర్‌ఏలు అధిక శాతంలో దారిద్ర రేఖకు దిగువ ఉన్నవారే ఉన్నారని ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి. పే స్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీ ఎం కేసీఆర్‌ 3 నెలల క్రితం జులై 24.2023న ఎట్టకేకలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్లు జీవో 81 జారీ చేశా రు. జారీ అయిన నెల తర్వాత 16.555 మందికి పే స్కేల్‌ అమలు వివిధ శాఖలకు బదలాయింపు చేస్తూ ఆర్థికశాఖ 85 జీవో జారీ చేసింది. మరో 3 వేల మందికి 61ఏండ్లు దాటిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని పొందు పరిచారు. 2 జీవోలను పరిగణలోకి తీసుకొని రాండమజాన్‌ పద్ధతిన వీఆర్‌ఏల బదలింపు ఆగస్టు9 2023. జరిగింది. ఆగస్టు 10న జిల్లా కలెక్టర్లు జిల్లాలో వివిధ శాఖలకు అలర్ట్‌ అయినా ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. దీం తో వారు ఉద్యోగాలు చేస్తూ 3 నెలలు దాటినా ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఐడి నెంబర్‌ రాక జీతాలు అందక సతమ తమవుతున్నారు. రాండమైజన్‌ పద్ధతిన కేటాయింపులు జరగడంతో కొందరికి జిల్లాలే మారిపోయాయి. ఉద్యోగం వచ్చిందని సంతోషంతో అప్పులు చేసి ఉద్యోగం నిర్వహి స్తున్నారు. జీతాలు చెల్లించాలని.ప్రభుత్వ అధికారులను వేడు కుంటున్న. కోర్టు కేసు ఉండడం వల్ల ఏమీ చేయలేకపో తున్నామని చేతులెత్తేస్తున్నారు. తప్ప వీరికి న్యాయం చేసే దిశలో ప్రభుత్వం మాత్రం ఆలోచన చేస్తలేదు. సమ్మె సమ యంలో రాష్ట్రవ్యాప్తంగా 111 మందికి పైగా మృతి చెం దారు. 2021 జూన్‌ ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్‌ ఔట్సో ర్సింగ్‌ ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులకు ప్రస్తుతం అందుతున్న జీతానికి మరో30 శాతం అనిటోరియం చెల్లిం చాలంటూ జీవో జారీ చేసింది. జీవోలో ప్రతి ఒక్కరికీ న్యా యం జరిగిన వీఆర్‌ఏలకు మాత్రం 30 శాతం హానిటో రియం అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. సమ్మె కాలం 3 నెలల జీతం ఇప్పటికీ అందలేదు. ఉద్యోగం నుండి లక్షల్లో జీతం తీసుకుంటున్న వారికి మాత్రం అన్ని వర్తిస్తాయి. రెక్కా డితే గాని డొక్కాడని వీఆర్‌ఏలకు మాత్రం ఏదీ వర్తించదా నిజం కాలం నుండి పనిచేస్తున్న వీఆర్‌ఏలకు ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించడం బాగానే ఉంది కానీ జీతాలు చెల్లిం చడంలో మాత్రం అలసత్వం వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి వీఆర్‌ఏకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ప్రతి వీఆర్‌ఏకూ న్యాయం చేయాలి: వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
ప్రభుత్వం ప్రతి వీఆర్‌ఏకు న్యాయం చేసి వారసులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రస్తుతం. వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తు న్న వీఆర్‌ఏలకు వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా ఐడి నెంబర్లు కేటాయించి జీతాలు చెల్లించాలి. వీ ఆర్‌ఏలకు పే స్కేల్‌ కల్పించడం తప్పు కాదు. లక్షల్లో జీ తాలు తీసుకుంటున్న వారికి. అదనంగా 30 శాతం ఆని టోరియం చెల్లించారు. నిత్యం అన్ని శాఖల అధికారుల కు.సహకరిస్తూ విధులు చేస్తున్న మాకు ఒక్క రూపాయి చెల్లించలేదు. ఇప్పటికి రాలేదు. వీఆర్‌ఏల సమస్యలను పెద్ద మనసుతో ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదు కుంటే.బాగుంటుంది
– జనార్ధన్‌, వీఆర్‌ఏ జేఏసీ వికారాబాద్‌ జిల్లా కో కన్వీనర్‌
న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు నైనా ఆశ్రయిస్తాం
న్యాయం జరగకపోతే. సుప్రీంకోర్టు నైనా ఆశ్ర యిస్తాం. రాండమెంజన్‌ సిస్టంలో పేర్లు ఉన్న 61 మంది వీఆర్‌ ఏలకు పోస్టింగ్‌ అలర్ట్‌ కాలేదు. వీఆర్వో వ్యవస్థ అమలులో ఉంటే 5 ఏండ్లు పైబడిన వారికి పదోన్నతులైన లభించేవి. ఆ వ్యవస్థ రద్దుతో అది కూడా దక్కకుండా పోయింది. వ్యవస్థ రద్దు అయినప్పుడు. ఏ ఒక్కరూ రద్దు వద్దంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిం చలేదు కానీ. త్వరగా పదోన్నతులు పొందిన వారికి ఐడీ లు ఇచ్చి జీతం చేసి పోస్టింగ్‌ అలర్ట్‌ కాని వారికి పోస్టింగ్‌ ఇచ్చి న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టు నైనా ఆశ్రయిస్తాం.
– కే సత్యనారాయణ,వీఆర్‌ఏల హక్కుల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌

Spread the love