సెమీకండక్టర్స్‌ ఉత్పత్తిలో మనమెక్కడీ

సెమీకండక్టర్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రస్తుతం అంతర్జాతీ యంగా ప్రధానమైన చర్చనీయాంశమైంది. సెమీకండక్టర్స్‌ అంటే సాధారణంగా చిప్‌గా భావిస్తాము. వీటి తయారీకి ఉపయో గిస్తున్న ప్రధానమైన రా మెటీరియల్‌ సిలికాన్‌. చిప్‌లు స్మార్ట్‌ ఫోన్లు, కార్లు, కంప్యూటర్లు మొదలుకొని భద్రత అవసరాలు, రాకెట్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెంట్‌ వరకు ఆధునాతన సాంకే తిక ఆవిష్కరణలన్నింటికీ ప్రధానమైన అవసరం. పర్యావరణం పరంగా కర్బన్‌ ఉద్గారాలను తగ్గించడం కోసం సోలార్‌ విద్యుత్‌, ఎలక్ట్రికల్‌ వాహనాలు, డ్రైవర్లు లేకుండా నడవగలిగే వాహనాలకు సెమీకండక్టర్లు పెద్దఎత్తున అవసరం ఉన్నది. ఆర్థిక, సాంకేతిక వ్యవస్థకు ఆయువుపట్టు లాంటి సెమీకండక్టర్స్‌ ఉత్పత్తికి, సప్లై చైన్‌గా వృద్ధి చెందడానికి అభివృద్ధి చెందిన దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికైతే సెమీకండక్టర్స్‌ టెక్నాలజీపై పట్టు అమెరికాదే. చై నా తక్కువ ధరతో అధిక నాణ్యత కలిగిన సిలికాన్‌ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నది. సెమీ కండక్టర్స్‌ చిప్స్‌ తయారీకి వినియోగించే ముడిస రుకులు సిలికాన్‌ 60లక్షల మెట్రిక్‌ టన్నులు 70శాతం, జెర్మిని యం 95 మెట్రిక్‌ టన్నులు 68శాతం, గాలియం 420 మెట్రిక్‌ టన్నులు 98శాతం చైనా సరఫరా చేస్తున్నది.రేర్‌ ఎర్త్‌ ఎలిమెం ట్స్‌ (అర్‌ఈఈ)లను అవి కనుగొనబడిన రాతి నుండి వేరు చేయడానికి అవసరమైన ప్రక్రియలు కష్టతరమైనది, ఖరీదైనది. పూర్తి పదార్థాన్ని వెలికితీసేందుకు, శుద్ధి చేయడానికి వేల దశలు అవసరం. అర్‌ఈఈ మైనింగ్‌, రిఫైనింగ్‌పై దష్టి సారించిన కొన్ని దేశాలలో చైనా ఒకటి, దీని ఫలితంగా ప్రపంచంలోని టంగ్‌స్టన్‌, మాలిబ్డినం సరఫరాలో 85 శాతం ఆ దేశం ఉత్పత్తి చేస్తుంది. సెమీ కండక్టర్స్‌ ఉత్పత్తిలో తైవాన్‌కు చెందిన తైవాన్‌ సెమీకండక్టర్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ (టి.ఎస్‌.యం. సి) దే ఆధిపత్యం. అత్యంత ఆధునికమైన సెమీకండక్టర్స్‌ 90 శాతం, ఇతర అన్ని రకాల సెమీకండక్టర్స్‌ ఉత్పత్తిలో 60 శాతం తైవాన్‌ ఉత్పత్తి చేస్తుంది. ఆపిల్‌, ఇంటెల్‌ వంటి దిగ్గజ సంస్థలకు సెమీకండక్టర్స్‌ను టి.ఎస్‌.యం.సి సరఫరా చేస్తున్నది. నైపుణ్యం కలిగిన మ్యాన్‌ పవర్‌ ఉండడం ప్రధాన కారణం.
కోవిడ్‌-19వల్ల పోర్టులు, ఎయిర్‌పోర్టులు పని చే యలేదు. రవాణారంగం స్తంభించిపోయింది. సర ఫరా చైన్‌ తెగిపోయి అనేక దేశాల ఆర్థిక అభివృద్ధికి ఆటంకమైంది. నాటో కూటమి, రష్యా యుద్ధ క్షేత్రమై న ఉక్రెయిన్‌ చిప్పుల తయారీలో లేజర్లను నియంత్రిం చడానికి ఉపయోగించే నియాన్‌ గ్యాస్‌లో 50 శాతం ఉత్పత్తి చేసేది. ఈగ్యాస్‌ సరఫరాకు ఆటంకాలు ఏర్ప డ్డాయి. చైనాలో విడదీయరాని భాగం అయినా తైవాన్‌పై బీజింగ్‌ పట్టు సాధిస్తుందని భావిస్తున్న పశ్చిమ యూరప్‌ దేశాలు సెమీకండక్టర్స్‌ కోసం తైవాన్‌పై ఆధారపడడం తగ్గిం చుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేప థ్యంలో మన దేశంతో సహా అనేక అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశా లు తమ తమ దేశీయ అవసరాలు తీర్చుకోవడా నికి, అదే సమయంలో సప్లై చైన్‌గా వద్ధి చెందడానికి ప్రయ త్నిస్తున్నాయి. సెమీకండక్టర్స్‌ తయారీకి బూస్టింగ్‌ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం 52 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని పెడు తున్నది. యూరోపియన్‌ యూనియన్‌ 43 బిలియన్‌ యూరో లను పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. చైనా 145 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతున్నది. సెమీ కండక్టర్స్‌, డిస్ప్లే తయారీని పెంచడానికి భారత ప్రభుత్వం రూ.76 వేల కోట్ల (10 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) ప్యాకేజీని 2021 డిసెంబర్‌ 15న ప్రకటించింది. సెమీకండక్టర్స్‌ మెటీరియల్‌ మార్కెట్‌ సుమారు 65 మిలియన్‌ డాలర్లకు చేరింది. సెమీకండక్టర్స్‌కు ఉపయోగించే సిలికాన్‌ వంటి కొన్ని రకాల మెటీరియల్‌ చౌకగా, సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉత్పత్తి ఖర్చులు చాలా ఎక్కువ అవుతు న్నాయి. సెమీకండక్టర్లు ఎలక్ట్రానిక్‌ పరికరాలలో ముఖ్యమైన భాగం. ప్రపంచవ్యాప్తంగా రోజుకు బిలియన్లలో ఉత్పత్తి, విని యోగం జరుగుతున్నాయి. ఇండియా 90శాతం సెమీకండక్ట ర్లను చైనా, తైవాన్‌, సౌత్‌కొరియా తదితర దేశాలనుండి దిగుమతి చేసుకుంటున్నది.
ప్రపంచంలోని సెమీకండక్టర్‌ డిజైన్‌ ఇంజనీ ర్లలో భారత దేశం 20శాతం వాటా కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్‌ పరిశ్రమలో దాదాపు 1,50,000 మంది భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. భారత దేశాన్ని గ్లోబల్‌ హబ్‌గా మార్చడం, దేశంలో శక్తివం తమైన సెమీకండక్టర్‌ డిజైన్‌ ఎకోసిస్టం రూపొందిం చడం కోసం జాతీయ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ (2019) లక్ష్యంగా పెట్టుకున్నది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ దేశీయ పరిశ్రమలో సెమీకండక్టర్‌ డిజైన్లు వృద్ధి చేయడానికి డిజైన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (డిఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించింది. డిఎల్‌ఐ ఇం టిగ్రేటెడ్‌ సర్క్యూట్లు (ఐసీలు), చిప్‌ సెట్లు, సిస్టం ఆన్‌ చిప్స్‌ (ఎస్వోసిఎస్‌), సిస్టమ్‌లు అండ్‌ సెమీకండక్టర్‌ డిజైన్‌ అభివృద్ధి, విస్తరణకు వంద దేశీయ స్టార్ట్‌అప్‌ కంపెనీలకు వివిధ దశలలో ఆర్థిక ప్రోత్సాహకాలు, డిజైన్‌ మౌలిక సదుపాయాల మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకోగా కేవలం ఏడు స్టార్ట్‌అప్‌లను మాత్రమే ఆమోదించింది. ఎలక్ట్రానిక్‌ కాంపో నెంట్స్‌, సెమీకండక్టర్స్‌ (SPECS) సహకారంతో రాజస్థాన్‌కు చెందిన సహస్ర సెమీకండక్టర్స్‌ కంపెనీ మెమరీ చిప్‌లను ఉత్పత్తిని భివాడి జిల్లాలోని సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌, ప్యాకే జింగ్‌ యూనిట్‌లో ప్రారంభించింది. గ్లోబల్‌ చిప్‌మేకర్‌ అయిన అమెరికా ఆధారిత మైక్రోన్‌, గుజరాత్‌లో కొత్త అసెంబ్లీ, టెస్ట్‌ యూనిట్‌ను స్థాపించడానికి 825 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతున్నది. 2024 చివరినాటికి సనంద్‌లో ఉత్పత్తుల తయారీని ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయంలో 50శాతం, గుజరాత్‌ ప్రభుత్వం నుండి అదనంగా 20శాతం సహాయం అందిస్తున్నది.
స్వదేశీ ఎలక్ట్రానిక్స్‌ కాంట్రాక్ట్‌ తయారీ సేవల కంపెనీ కేన్స్‌ టెక్నాలజీ అనుబంధ సంస్థ కేన్స్‌ సెమికాన్‌ ద్వారా హైదరాబాద్‌ కొంగర కలాన్‌ వద్ద సెమీకండక్టర్‌ ఓ.ఎస్‌.ఏ.టి, కాంపౌండ్‌ సెమీకండక్టర్‌ సౌకర్యాన్ని ప్రారంభించడానికి కంపెనీ రూ.28 వందల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దీని ద్వారా రెండువేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ప్రారంభ మూడేండ్లలో కేన్స్‌ సెమికాన్‌ క్యూఎఫ్‌ఎన్‌ (క్వాడ్‌ ఫ్లాట్‌ నో-లీడ్స్‌ ప్యాకేజీ), ఎస్‌.వో.టి (స్మాల్‌ అవుట్‌లైన్‌ ట్రాన్సిస్టర్‌), టివో (ట్రాన్సిస్టర్‌ అవుట్‌లైన్‌), బిజీఏ (బాల్‌ గ్రిడ్‌ అర్రే) లతో సహా వివిధ ప్యాకేజీ రకాలతో గ్లోబల్‌ కస్టమర్‌లకు సహాయం చేస్తుంది.
ఎచ్‌.సి.ఎల్‌ అవుట్‌సోర్స్డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్టింగ్‌ (ఓ.ఎస్‌.ఏ.టి) యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి తైవానీస్‌ ఎల క్ట్రానిక్స్‌ తయారీ సేవల దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో జాయింట్‌ వెంచర్‌ (జెవి)ని కొనసాగిస్తోంది. ఫాక్స్‌కాన్‌ 37.2 మిలియన్ల అమెరికన్‌ డాలర్లుకు 40 శాతం ఈక్విటీని కలిగి ఉన్నది. ఎచ్‌.సి.ఎల్‌ హార్డ్‌ వేర్‌ కంపెనీగా ప్రారంభమైనప్పటికీ, సెమీకండక్టర్‌ డొమైన్‌లో డిజైన్‌ సేవలందించడంలో దాని ప్రస్తుత దష్టి ప్రధానంగా ఉంది. సెమీకండక్టర్‌ స్పేస్‌లో సహకారాన్ని పెంచుకోవడానికి యూరోపియన్‌ యూనియన్‌. ఇయు-ఇండియా ట్రేడ్‌ అండ్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ (టిటిసి) ఫ్రేమ్‌వర్క్‌ కింద సెమీకండక్టర్‌ ఎకో సిస్టమ్స్‌, దాని సరఫరా గొలుసు, ఆవిష్కరణలపై వర్కింగ్‌ అరేం జ్‌మెంట్స్‌పై భారత్‌, యూరోపియన్‌ కమిషన్‌ మధ్య అవగాహన ఒప్పందం గతేడాది నవంబర్‌ 21న కుదిరింది.
స్థిరమైన సెమీకండక్టర్లను అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయడానికి ”ఇండియా సెమీకండక్టర్‌ మి షన్‌ (ఐఎస్‌ఎమ్‌)” కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమెరికా చైనా మధ్య జరుగుతున్న టెక్నాలజీ వార్‌, రాజకీయ, ఆర్థిక, వాణిజ్య వ్యూహాత్మక వార్‌ నేపథ్యంలో చైనా తన దేశీయ కొను గోలుశక్తి పెంచుకోవడానికి, ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెంచిన పరిస్థితిలో ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థలు భారత్‌ వైపు చూస్తాయని కేంద్ర ప్రభుత్వం కలలుగంటున్నప్పటికీ ఒక్కడుగు ముందుకు..రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఫోక్స్కాన్‌ వేదాంత కంపెనీతో కుదు ర్చుకున్న ఒప్పందం నుండి వెనక్కి పోయింది. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం ఉం డడం, కేంద్ర ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతన లేక పోవడం వంటి కారణాల వలన భారత్‌కు ఈ రంగంలో అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు.

– గీట్ల ముకుంద రెడ్డి
9490098857

Spread the love