ప్రజల మద్దతు ఎటువైపు.?

– పబ్లిక్ పల్స్…జోరుగా కాల్స్
నవతెలంగాణ – మల్హర్ రావు
పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజల పల్స్ తెలుసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐవిఆర్ కాల్స్ ద్వారా ఓటర్ల మద్దతు తెలుసుకొనే పనిలో పడ్డాయి. పెద్దపల్లి పార్లమెంట్ లో ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ను ప్రకటించారు.కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటికి ఎవరనేది అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. అభ్యర్థి ద్వారాలను ఆశిస్తున్న ఆశవాహుల్లో ఎవరికీ ఓటర్ల మద్దతు ఉంటుందనేది పార్టీల వ్యూహ కర్తలు వాయిస్ కాల్స్ ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లుగా సమాచారం.
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న మంథని,పెద్దపల్లి,చెన్నూర్,మంచిర్యాల,బెల్లంపల్లి నియోజకవర్గాలున్నాయి. అయితే కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని,పెద్దపల్లి మాజీ ఎంపీ సుగుణ కుమారి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ తనయుడు గడ్డం వంశీలు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏనాడు పార్లమెంట్ వైపు కన్నెత్తి చూడక దేశం కానీ దేశంలో ఉంటూ 25 సంవత్సరాల తరువాత రాజకీయంలో అడుగుపెడుతున్న సుగుణ కుమారికా.? ఉద్యోగానికి రాజీనామా చేసి 2018లో చెన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలమైన 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,బిఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీగా అనూహ్యంగా గేసిన పెద్దపల్లి పార్లమెంట్ ను కనీసం అభివృద్ధి చేయని బోర్లకుంటా వెంకటేష్ నేతకాని కా.?  స్వర్గీయ వెంకటస్వామి తాతగారి రాజకీయాల పునికి పుచ్చుకుని పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న గడ్డం వంశీకా? అనేది సందిగ్ధంలో ఉంది.
Spread the love