- Advertisement -
గుండెపోటుతో ప్రయివేట్ టీచర్ మృతి
నవతెలంగాణ- మధిర
పాఠశాలలో విధుల్లో ఉండగానే ఓ ప్రయివేటు టీచర్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఎన్జీవోస్ కాలనీకి చెందిన గారపాటి జయరాజ్(47) జయరాజు ఖమ్మంలోని ఓ ప్రయివేట్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం టీచర్లకు బోధన చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శనివారం ఆయనది పెండ్లి రోజు కూడా. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- Advertisement -



