Sunday, May 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబండి సంజరుని బర్తరఫ్‌ చేయాలి

బండి సంజరుని బర్తరఫ్‌ చేయాలి

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్రమంత్రి బండి సంజరుని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంజరు కుమారున్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం నానా తంటాలు పడుతోందని విమర్శించారు. నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు బాలిక కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బండి సంజరు కుమారుడిపై ఎలాంటి చర్య తీసుకోబోతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదంగానే మారుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మీ పార్టీ ఎలాంటి ‘జంగిల్‌ రాజ్‌’ నడుపుతుందో చెప్పాలని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. ఒక మైనర్‌ బాలిక అన్ని ఆధారాలతో వచ్చినప్పుడు పోలీస్‌ శాఖ వేగంగా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఉన్నావ్‌ కేసులో చేసినట్టుగా, రాహుల్‌ హైదరాబాద్‌ వచ్చి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలబడాలన్నారు. మైనర్‌ బాధితురాలు, ఆమె కుటుంబం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించుకోవడానికే మూడు నెలలకుపైగా ఎందుకు పోరాడాల్సి వస్తోందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి ఒక ‘ఫ్రాంచైజీ’లా మారిందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మైనర్‌ ఆత్మ గౌరవ విషయంలో రెండు పార్టీలు కలిసి అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయని ఆరోపించారు. ఇతర ఫోక్సో కేసు నిందితుల మాదిరిగా మంత్రి కుమారుడిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -