నవతెలంగాణ – హైదరాబాద్ : శనివారం వైట్ హౌస్ ప్రెస్ డిన్నర్లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి 31 ఏళ్ల కోల్ టోమాస్ అలెన్. ఇతను కాలిఫోర్నియాలోని టోర్రాన్స్‌కు చెందిన వ్యక్తి అని, ఇతను ఓ ఉపాధ్యాయుడు , సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని తాజాగా అధికారులు తెలిపారు. ఇతను వైట్ హౌస్ ప్రెస్ డిన్నర్లో ఓ అధికారి దగ్గరగా కాల్పులు జరపగా పర్సనల్ సెక్యూరిటీ వల్ల బయటపడ్డారని ట్రంప్ మీడియా సమావేశంలో వెల్లడించారు. టోమాస్ ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్నారని తనపై సోమారం అధికారికంగా అభియోగాలు మోపే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు.
కాగా, టోమాస్ అలెన్ పేరు మీద ఉన్న లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్) నుండి 2017లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. 2025లో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ డొమింగెజ్ హిల్స్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. కంప్యూటర్ సైంటిస్ట్, గేమ్ డెవలపర్, ఉపాధ్యాయుడు కూడా పనిచేశాడు. అలెన్ ప్రైవేట్ ట్యూటరింగ్, కళాశాల ప్రవేశాల తయారీ సంస్థ అయిన సి2 ఎడ్యుకేషన్‌లో చాలా సంవత్సరాలు పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేశారని సమాచారం. అలాగే కళాశాల ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్యూషన్ చెప్పినట్లు అతని ఫేస్‌బుక్ పోస్టులు తెలియజేస్తున్నాయి.
అలెన్ ఓ స్వతంత్ర గేమ్ డెవలపర్ గా కూడా. అతను స్టీమ్ ప్లాట్‌ఫామ్‌పై మాలిక్యులర్ కెమిస్ట్రీపై ఒక వీడియో గేమ్‌ను క్రియేట్ చేశారు. మరో ప్రాజెక్టు కూడా డెవలప్ చేశారు. అంతరిక్ష నేపథ్యంలో రూపొందించిన ఒక “టాప్–డౌన్ షూటర్” స్టైల్ గేమ్ ను క్రియేట్ చేశారు. 2014లో నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధన ఫెలోషిప్‌లో అలెన్ పాల్గొన్నట్లు సమాచారం.



