Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చైల్డ్ కేర్ అమ్మాయి వివాహ వేడుకకు హాజరైన జిల్లా అధికారిణి 

చైల్డ్ కేర్ అమ్మాయి వివాహ వేడుకకు హాజరైన జిల్లా అధికారిణి 

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ ) అనాధలు, నిరాశ్రయులు, బాలికలకు ఆశ్రమం కల్పిస్తారు. వసతి, భోజనం, విద్య అందించడం జరుగుతుంది. అలాంటి పిల్లల సంరక్షణ సంస్థలో చిన్నప్పటి నుంచి పెరిగిన 21 సంవత్సరాల వయసు గల బాలికను రేవెల్లి గ్రామానికి చెందిన యువకుడు ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు జిల్లా సంక్షేమ అధికారిణి రాజేశ్వరి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు సంతోషంగా వైభవంగా పెళ్లి వేడుకలను జరిపించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ సమితి చైర్పర్సన్ లక్ష్మణరావు, జంగిటి విష్ణు, ప్రసన్న, జిల్లా బాలల పరిరక్షణ అధికారి శ్రీశైలం, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -