Saturday, June 27, 2026
E-PAPER
Homeసోపతి'ఆకుపచ్చ'రంగులోనే ఎందుకు?

‘ఆకుపచ్చ’రంగులోనే ఎందుకు?

- Advertisement -

మనం జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు వెంబడి వివిధ గుర్తుల్లో ప్రమాద సూచిక బోర్డులతో పాటు అక్కడక్కడా ‘ఆకుపచ్చ రంగులో’ సైన్‌ బోర్డులు కనిపిస్తాయి. హైవేలపై ఏర్పాటు చేసిన గ్రీన్‌ కలర్‌లో ఉండే సైన్‌ బోర్డుల మీద నగరాల పేర్లు, దూరాలు, దిశలు వంటి ఆ రూట్‌కు సంబంధిన వివరాలు తెల్లని అక్షరాలతో రాసి ఉంటాయి. అయితే మీకెప్పుడైనా సందేహం వచ్చిందా? హైవేలపై ఏర్పాటు చేసే సైన్‌ బోర్డులు ఆకుపచ్చ రంగులోనే ఎందుకుంటాయి? వేరే రంగులు ఎందుకు వాడరు?
హైవేలపై సైన్‌బోర్డులు ఆకుపచ్చరంగులోనే ఏర్పాటు చేయడం వెనుక కొన్ని సైన్స్‌, మానసిక కారణాలు దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు. మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇలాగే ఏర్పాటు చేస్తారు. జాతీయ రహదారులపై ఉపయోగించే ప్రతిరంగుకు ఒక అర్థం దాగి ఉంటుంది. అందులోనూ ట్రాఫిక్‌ నిబంధనలు తెలియజేయడంలో ఈ రంగుల పాత్ర కీలకం. నేషనల్‌ హైవేలపై వేగంగా వెళతాం కాబట్టి వాహనదారులు ఈజీగా గుర్తించేందుకు వివిధ రంగుల్లో సూచిక, సైన్‌బోర్డులను ఏర్పాటుచేస్తారు.

అందులో ఎరుపు రంగు విషయానికొస్తే ప్రమాదం పొంచి ఉందని, వాహనాన్ని వెంటనే నిలిపివేయాలనే హెచ్చరికలను తెలియజేయడానికి వినియోగిస్తున్నారు. పసుపు రంగు డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి, నీలం రంగు సమీపంలో ఉన్న ఆసుపత్రి, పెట్రోల్‌బంక్‌, విశ్రాంతి గదులు వంటి ప్రజాసౌకర్యాలను సూచిస్తాయి. ఇకపోతే జాతీయ రహదారులపై కనిపించే బోర్డులపై ఆకుపచ్చరంగు మాత్రం వీటికి భిన్నంగా దిశలను చూపేందుకు వేస్తారు.
మనిషి కంటి నిర్మాణం, మెదడు పనిచేసే తీరుకు అనుగుణంగా ‘ఆకుపచ్చ రంగు’ను వినియోగిస్తారని చెబుతున్నారు నిపుణులు. నార్మల్‌గా హెచ్చరిక సంకేతాలు తెలియజేయడానికి రోడ్లపై ఎరుపు, పసుపు ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ ఇవి కళ్లకు త్వరగా అలసట కలిగించే ఛాన్స్‌ ఉంటుంది. అదే ఆకుపచ్చ రంగు విషయానికొస్తే, ఇది శాంతమైన రంగు. ఇతర రంగులతో పోలిస్తే, ఆకుపచ్చరంగును ఎంతసేపు చూసినా కళ్లపై ఎలాంటి ఒత్తిడి పడదు. దాంతో కళ్లు అలసిపోవు. జాతీయ రహదారులపై సుదీర్ఘ ప్రయాణాలు చేసే డ్రైవర్లకు గ్రీన్‌ కలర్‌ ఎంతో మేలు చేస్తుంది.

జాతీయరహదారిపై సైన్‌బోర్డులకు ఆకుపచ్చరంగులో తెల్లటి అక్షరాలు రాయడంలో కొంత సైన్స్‌కూడా ఉంటుందటం. ముఖ్యంగా హైవేలపై ఏర్పాటు చేసే గ్రీన్‌ కలర్‌ బోర్డులపై రాసిన అక్షరాలు పగటిపూట సూర్యకాంతిలోనే కాకుండా, రాత్రి చీకట్లోనూ చాలా స్పష్టంగా కన్పిస్తాయి. నైట్‌ టైమ్‌లో వెహికల్స్‌ హెడ్‌లైట్ల వెలుతురు ఈ బోర్డులపై పడగానే అక్షరాలు మెరిసిపోయేలా స్పెషల్‌ టెక్నాలజీని ఉపయోగిస్తుంటారు. దీనివల్ల దట్టమైన చీకటి లేదా మంచు కురిసే సమయాల్లోనూ డ్రైవర్లు ఎక్కువ దూరం నుంచే దారిని, ఊర్ల పేర్లను ఈజీగా గుర్తించగలుగుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -