- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జగదేవపూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య.. తన భార్య జయలక్ష్మిపై ఇనుప రాడుతో దాడి చేశాడు. శుక్రవారం బాధితురాలు మేనత్త ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. అనుమానంతో తరచూ వేధింపులకు పాల్పడుతున్న నర్సయ్య, భార్య తలపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



