Saturday, June 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుభార్యపై కాల్పులు

భార్యపై కాల్పులు

- Advertisement -

అనుమానంతో రివాల్వర్‌ తో షూట్ చేసిన భర్త
మల్కాజిగిరిలో ఘటన


నవతెలంగాణ-మల్కాజిగిరి ​
మేడ్చల్‌ మల్కాజిగిరిలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్‌తో కాల్చి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. మల్కాజిగిరిలోని మారుతినగర్‌ ‌కు చెందిన అరుణ్‌ రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారి. ఐదేండ్ల కిందట తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. ఆమె సొంత చెల్లెలు నిషా రాణిని యాదగిరిగుట్టలో రెండో వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, అరుణ్ ఆరు నెలల కిందట అక్రమంగా రివాల్వర్ కలిగి ఉన్న కేసులో అంబర్‌పేట్ పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన అనంతరం ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చినట్టు తెలిసింది. అయితే, కొంతకాలంగా వేరే వ్యక్తితో భార్య సన్నిహితంగా ఉంటుందన్న అనుమానం పెంచుకున్న అరుణ్ బుధవారం ఇంట్లోనే ఆమెపై రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన మల్కాజిగిరి సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.​


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -