ఒకే కుటుంబంలో ముగ్గురికి గాయాలు
నవతెలంగాణ-కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని వినాయక్‌నగర్ కాలనీలో బుధవారం ఓ ఇంట్లో వంట గ్యాస్ లీకేజీకావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్యాస్ సిలిండర్‌ను మార్చే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన మల్లవ్వ, మౌనిక, అలేఖ్య అనే మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఇంటి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలి ఉంటే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



