Monday, June 15, 2026
E-PAPER
Homeజాతీయంనావికుల హత్యను ట్రంప్‌ దృష్టికి తెస్తారా ?

నావికుల హత్యను ట్రంప్‌ దృష్టికి తెస్తారా ?

- Advertisement -

ప్రధానిని ప్రశ్నించిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ :
అమెరికా వాణిజ్య ప్రతినిధి జమైసన్‌ గ్రీర్‌ భారత పర్యటనను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశమైనా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకు నేందుకు ఫోన్‌కాల్స్‌, పత్రికా ప్రకటనలకే పరిమితం కాదని, అంతకుమించి చేయా ల్సింది చాలానే ఉన్నదని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశం అవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఒమన్‌ తీరంలో నౌకపై అమెరి కా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు చనిపోయిన ఘటనను ఆ సందర్భంగా గట్టిగా ఖండిస్తారా అని మోడీని ప్రశ్నిం చింది. ఈ నెల 12న విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో టెలిఫోన్‌ సంభాషణ జరిపినప్పుడు అమెరికా మంత్రి మార్కో రుబియో ఉపయోగించిన ‘ఆమోద యోగ్యం కాని, బెదిరింపు’ భాషను కూడా ట్రంప్‌ దృష్టికి తేవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ప్రధానిని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -