పేదల కోసం పోరాడే జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య
నవతెలంగాణ – వలిగొండ రూరల్
నిరంతరం పేదలు,వ్యవసాయ కార్మికులు,రైతుల సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపును కోరుతూ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం రైతులు,వ్యవసాయ కూలీలు, కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో జహంగీర్ గెలిస్తే ఈ ప్రాంతంలో ఉన్న త్రిబుల్ ఆర్ బాధితుల సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని పార్లమెంట్ వేదికగా అలైన్మెంట్ మార్పు కోసం పోరాడుతారని తెలిపారు. ఇప్పటిదాకా జరిగిన అనేక ఆందోళనలో సీపీఐ(ఎం) పార్టీ అగ్ర భాగాన నిలిచిందని భవిష్యత్తులో జహంగీర్ గెలిస్తే ప్రజలకు భువనగిరి కేంద్రంగా అందుబాటులో ఉంటారని తెలిపారు. డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ అధిపతులు గెలవడం ద్వారా ప్రజలకు మరిన్ని కష్టాలు తప్ప ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం జరగదన్నారు. ధరల పెరుగుదలను  పార్లమెంట్ వేదికగా పోరాడే వారు కావాలని, ఉపాది హామీ పథకం చట్ట రక్షణ కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ కు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి శాఖ కార్యదర్శి, మెట్టు రవీందర్ రెడ్డి నాయకులు, గూడూరు బుచ్చిరెడ్డి, చేగూరి రాములు ఎస్ఎఫ్ఐ మండల నాయకులు వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
Spread the love